Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే భార్యకు వీటిని బహుమతిగా ఇస్తే చాలు!
హిందూ సంస్కృతిలో లక్ష్మీదేవిని సిరి సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రకారం భర్త.. భార్యకు ఈ 5 బహుమతులు ఇవ్వడం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందవచ్చట. అవేంటో ఇక్కడ చూద్దాం.

లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి?
సిరి సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం పొందాలని అందరూ కోరుకుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బు కొరత ఉండదని భావిస్తారు. హిందూ సంప్రదాయంలో ఆడపిల్లలను లక్ష్మీదేవిగా భావిస్తారు. ఆడపిల్ల పుడితే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందంటారు. వారిని చక్కగా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుందంటారు. అయితే కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి (భార్య) సంతోషాన్ని పట్టించుకోరు.
భార్యను సంతోష పెట్టే బహుమతులు
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఎవరైతే తన భార్యను సంతోషంగా ఉంచుతారో, వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందట. వారిపై కనక వర్షం కురుస్తుందట. జ్యోతిష్య నిపుణుల ప్రకారం మీ భార్య సంతోషంగా ఉండాలంటే ఆమెకు ఈ ఐదు బహుమతులు ఇవ్వాలట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పాకెట్ మనీ
మీ సంపాదనలో కొంత భాగాన్ని మీ భార్యకు పాకెట్ మనీగా ఇవ్వండి. దానివల్ల ఆమె ఖచ్చితంగా సంతోషిస్తుంది. అంతేకాదు.. మీ ఇంటి లక్ష్మీకి మీ సంపాదనలో కొంత భాగాన్ని ఇస్తూ ఉంటే.. మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు.
భార్య అంగీకారంతో నిర్ణయం తీసుకోండి!
ఏదైనా పెద్ద లేదా చిన్న నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యతో ముందుగా మాట్లాడండి. ఆమె కూడా మీ జీవితంలో ఒక భాగం కాబట్టి మీ ప్రతి నిర్ణయంలోనూ మీ భార్యను భాగస్వామిని చేయండి. మీ భార్యను గౌరవిస్తే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది.
శుక్రవారం స్వీట్స్ తినిపించండి
శుక్రవారం నాడు మీ భార్యకు తెల్లటి రంగు స్వీట్లు తినిపించండి. తెల్లటి రంగు స్వీట్లు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి. కాబట్టి మీ ఇంటి లక్ష్మీదేవికి స్వీట్లు తినిపించడం మర్చిపోవద్దు. ఎరుపు రంగు వస్త్రాలు, పూలు, పసుపు ఇవ్వడం కూడా శుభప్రదం.
భార్యను నిందించకూడదు!
కొంతమంది పురుషులకు ఉన్న చెడ్డ అలవాటు.. భార్యను అందరి ముందు నిందించడం. దానివల్ల వారికి ఏం ఆనందం కలుగుతుందో తెలియదు. కానీ భార్యను నిందించే వ్యక్తి జీవితంలోకి లక్ష్మీదేవి ప్రవేశించదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, దానివల్ల ఆ వ్యక్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి సాధ్యమైనంతవరకు భార్యను సంతోషంగా ఉంచండి.
కిచెన్ లోని పదార్థాలు..
కిచెన్‌లో కొన్ని పదార్థాలను ఎప్పుడూ ఖాళీ కాకుండా చూసుకోవాలి. కిచెన్ పని కేవలం భార్యకు సంబంధించిందే అనుకోవద్దు. భార్యా భర్తలు ఇద్దరూ సమాన బాధ్యత వహించాలి. కిచెన్‌లో బియ్యం, ఉప్పు, పంచదార, ధాన్యాలు తక్కువగా ఉన్నప్పుడు మళ్లీ తెచ్చి నింపాలి. ఉప్పు, బియ్యం ఎప్పుడూ పూర్తిగా ఖాళీ కాకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.