- Home
- Astrology
- Zodiac signs: అరుదైన, శక్తివంతమైన యోగం... 4 రాశుల వారికి మహర్దశ, అంబానీలు అవ్వడం పక్కా..!
Zodiac signs: అరుదైన, శక్తివంతమైన యోగం... 4 రాశుల వారికి మహర్దశ, అంబానీలు అవ్వడం పక్కా..!
జోతిష్యశాస్త్రంలో సదమగుట్ట యోగం ఒక పవిత్రమైన, శక్తింతమైన యోగంగా పరిగణిస్తారు. ఇది ఏర్పడిన జాతకంలో ఆకస్మిక సంపద, కీర్తి, విజయాలు, రాజయోగ స్థాయి జీవితం లభిస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా.....

సదమగుట్ట యోగం అంటే ఏంటి?
జాతకంలో లగ్నం బలంగా ఉండి, అదృష్టాధిపతి మూడో స్థానంలో ఉండి, కుజుడు లగ్నాన్ని దృష్టిస్తే ఈ యోగం ఏర్పడుతుంది. ఇది 14 సంవత్సరాల వయసు నుండి ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి జీవితంలో అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. డబ్బు, కీర్తి, గౌరవం చాలా ఎక్కువగా పెరుగుతాయి. డబ్బు ఎటు నుంచి వస్తుందో తెలియకుండానే ఆస్తులు పెరుగుతాయి. సంబంధాలు బలపడతాయి. దీని వల్లే దీనిని రాజయోగం స్థాయి యోగం అని పిలుస్తారు.
ఈ యోగం వల్ల కలిగే ప్రయోజనాలు...
ఆకస్మికంగా ధన ప్రవాహం, ఆస్తి వృద్ధి కలుగుతుంది. కెరీర్, వ్యాపారంలో పురోగతి, గుర్తింపు లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మరి, ఈ యోగం ఏ రాశికి ప్రయోజనాలు కలగనుందంటే....
1.వృశ్చిక రాశి..
ఈ యోగం వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురానుంది. పాత సమస్యలు అన్నీ తొలగి, వ్యాపారంలో, ఉద్యోగంలో ఆసక్మిక విజయాలు లభిస్తాయి. అప్పులు తగ్గుతాయి. శత్రువులు దూరం అవుతారు. మానసిక బలం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు.
2.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారికి ఈ యోగం కోటీశ్వరులను చేయగలదు. విదేశీ వ్యాపారాలు, ఆన్ లైన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద లాభాలను కలిగిస్తాయి. స్నేహితులు, సంబంధాలు కొత్త అవకాశాలు తెస్తాయి. విద్య, కళ రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ యోగం కారణంగా ఈ రాశివారికి ధన లాభంతో పాటు మనశ్శాంతి, కీర్తి లభిస్తాయి.
3.మకర రాశి..
మకర రాశి వారికి ఈ యోగం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో స్థిరత్వం, కుటుంబ గౌరవం పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహన యోగం కొనుగోలు చేసే వారికి అవకాశం లభిస్తుంది. కోరికలు నెరవేరతాయి. ఈ యోగం కారణంగా జీవితంలో సంపద, గౌరవం పెరుగుతుంది.
4.మీన రాశి..
మీనం రాశివారికి ఈ యోగం ఆధ్యాత్మికత, కళా రంగం, వ్యాపారాలలో ప్రగతి తెస్తుంది. రుణాలు తీరతాయి, కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విశ్వాసం బలపడుతుంది. ఈ కాలంలో వారి సంపద, గౌరవం, సంతోషం నిరంతరం పెరుగుతాయి.