కలలో ఇవి కనిపించాయా.? మీరు ధనవంతులు కాబోతున్నట్లే..
కలలు రావడం సర్వసాధారణం. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. పండితుల అభిప్రాయం ప్రకారం మనకు వచ్చే కొన్ని కలలు ధనవంతులవుతారని సూచిస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కలలు వాటి ఫలితాలు
ప్రతీ ఒక్కరికి కలులు వస్తుంటాయి. జ్యోతిష్యంలో స్వప్నశాస్త్రం కూడా ఒక భాగం. మనకు వచ్చే కలలు, వాటి అర్థాలకు సంబంధించి ఈ శాస్త్రంలో సవివరంగా తెలిపారు.
ఆర్థికపరమైన..
కలలో కనిపించే కొన్ని అంశాలు ప్రతికూల ప్రభావానికి సంబంధించినవి అయితే. మరికొన్ని మంచిని సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కలలో కొన్ని రకాల అంశాలు కనిపిస్తే భవిష్యత్తులో మరీ ధనవంతులు కాబోతున్నట్లు అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అవేంటంటే..
అగ్గిపెట్టె కనిపిస్తే..
కలలో అగ్గిపెట్టె కనిపిస్తే మంచికి సంకేతంగా చెబుతున్నారు. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా బంగారాన్ని కొనుగోలు చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి.
నిప్పు..
నిప్పుల మీద నడుస్తున్నట్లు కలలో కనిపిస్తే సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. చేతిలో నిప్పు పట్టుకున్నట్లు కనిపిస్తే చెడు వార్త వినే అవకాశాలు ఉంటాయి. మీ శరానికి నిప్పు అంటుకుని కాలిపోతున్నట్లు కల వస్తే మీ దగ్గరి వారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని అర్థం. అయితే మీ చుట్టూ మంటలు ఉన్నట్లు కల వస్తే మంచికి సంకేతంగా చెబుతున్నారు. దీర్ఘకాల వ్యాధులు నయంకాబోతున్నాయని అర్థం చేసుకోవాలి.
తెల్లని పాము..
కలలో తెల్ల పాము కాటు వేసినట్లు కనిపిస్తే శుభవార్తలు వింటారు. కలలో పాము కాటు వేసినట్లు కనిపిస్తే అప్పుల సమస్యలు తొలగిపోయి, ఆర్థికంగా మెరుగవుతారని అర్థం చేసుకోవాలి. ఇక బంగారు పాము కనిపిస్తే భవిష్యత్తు బాగుంటుందని పండితులు చెబుతున్నారు.
కలలో నారిజం కనిపిస్తే..
కలలో నారింజ పండు కనిపిస్తే ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కలలో నారింజ పండు తింటున్నట్లు కనిపిస్తే జీవన ప్రమాణాలు మెరుగుపడబోతున్నాయి, పెళ్లి లేదా కొత్త ఆరంభాలకు ఇది సూచికగా చెబుతుంటారు. అలాగే కలలో నారింజ తింటున్నట్లు కనిపిస్తే జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు ఉండనున్నాయని అర్థం చేసుకోవాలి.
వీటితోపాటు..
ఇక కలలో ఏదైనా పండు తింటున్నట్లు కనిపిస్తే. అది డబ్బు ప్రవాహానికి సూచికగా భావించాలని పండితులు చెబుతున్నారు. పాతిపెట్టిన బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను కలలో కనిపిస్తే ఆర్థికంగా ఢోకా ఉండదని అర్థం చేసుకోవాలి.
కలలో పండిన గోధుమ కనిపిస్తే శుభప్రదంగా చెబుతున్నారు. ఆర్థికంగా మీరు పురోగమించనున్నారని అర్థం చేసుకోవాలి. కలలో అప్పు ఇస్తున్నట్లు కనిపిస్తే మీకు రావాల్సిన డబ్బు వస్తుందని అర్థం. కలలో వజ్రాలు , ఆభరణాలను చూడటం లక్ష్మీ దేవి అనుగ్రహానికి సూచికగా చెబుతుంటారు.
డబ్బుల విషయంలో ఎలంటి ఢోకా ఉండదని అర్థం. కలలో కుండలు తయారు చేస్తున్నట్లు కనిపించినా మంచికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.