జగన్ ప్రస్థానం: ముఖ్యమంత్రి కొడుకు నుండి ముఖ్యమంత్రిగా

First Published 23, May 2019, 12:49 PM

 ఏపీ సీఎంగా వైసీపీ చీఫ్‌ వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీన ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీన వైసీపీ శాసనసభపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  జగన్‌ను వైసీపీ శాసనసభపక్ష నేతగా ఎన్నుకొంటారు. వైఎస్ఆర్ తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.... స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 2004లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2009 లో జరిగిన ఎన్నికల్లో  కూడ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది.  వైఎస్ ఆర్ రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలోనే కడప ఎంపీ స్థానం నుండి జగన్ కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

2009 సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంతకాలు చేసి లేఖను ఇచ్చారు.

అయితే జగన్‌ను కాకుండా ఆ సమయంలో రోశయ్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎంగా చేసింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేసింది. తన తండ్రి చనిపోయిన సమయంలో  మృత్యువాత పడిన వారిని ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర నిర్వహిస్తానని జగన్ ప్రకటించారు.ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వలేదు. కానీ, జగన్ మాత్రం యాత్రను కొనసాగించారు.

ఇదిలా ఉంటే సోనియాగాంధీ లేఖ రాసినా లేకపోతే వైఎస్ జగన్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడినా జగన్ మాత్రం యూపీఏకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తనను కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను వైఎస్ జగన్ మరచిపోలేదని తెలుస్తోంది.

ఆ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ కూడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో కూడ మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర విభజన జరిగింది. ఈ సమయంలో వైసీపీ సమైఖ్య నినాదాన్ని ఎత్తుకొంది.  ఈ ఎన్నికల్లో వైసీపీ చావో రేవో తేల్చుకోవాలని  పోరాటం చేసింది.కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.  బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి. అతి తక్కువ ఓట్ల తేడాతో 2014లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.

అయినా కూడ వైసీపీ చీఫ్ జగన్ ఏ మాత్రం విశ్వాసాన్ని సడలకుండా పార్టీని ముందుకు నడిపించాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం మోసం చేయడంతో జగన్ ఈ విషయమై పెద్ద ఎత్తున  ప్రచారం నిర్వహించారు.ఈ విషయమై చంద్రబాబునాయుడు తీరును ఎండగట్టారు.

ఏపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సుదీర్ఘంగా  జగన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టనున్న నవరత్నాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పాదయాత్ర సమయంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కూడ ఆ తర్వాత మేనిఫెస్టోలో చేర్చారు.

చంద్రబాబునాయుడు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు వైసీపీకి అనుకూలంగా మారాయి. జగన్‌కు ఏం అర్హత ఉంది... ఆయన  సీఎం కొడుకు ... అంత మాత్రాన సీఎం పదవి చేపట్టాల్సిందేనా అంటూ ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేశారు. కానీ, ముఖ్యమంత్రి కొడుకుగా పార్టీని ఏర్పాటు చేసి.... ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.ఏపీ రాష్ట్రంలో సీఎంగా కొడుకుగా ఉన్న వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భాలు ఇప్పటివరకు లేవు.

loader