చంద్రబాబు టికెట్లు ఇచ్చినా టీడీపిలో ఉండేది లేదంటున్న నేతలు

First Published 15, Mar 2019, 6:38 PM

అమరావతి: అభ్యర్థుల ఎంపిక అనేది ఆయా పార్టీల అధినేతలకు పెద్ద తలనొప్పేనని చెప్పుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కత్తిమీద సామేననడంలో ఎలాంటి సందేహమే లేదు. టికెట్ దక్కించుకున్న వారి పరిస్థితి ఒకే, టికెట్ రానివారి నుంచి ఎదురయ్యే తిరుగుబాటు, అసంతృప్తి తట్టుకోవడం అంటే ఒక సవాల్ అనే చెప్పుకోవాలి.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేశారు. 126 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు. టికెట్ దక్కనివారు పార్టీ మారుతున్నారంటే ఒక అర్థం ఉంది.

కానీ టికెట్లు దక్కించుకున్న వారు సైతం పార్టీలు మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. తొలిజాబితాలోనే టికెట్లు దక్కించుకున్న వారిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, తోట త్రిమూర్తులు, పితాని సత్యనారాయణ, గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు.

పార్లమెంట్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేశారు. అలా పార్లమెంట్ అభ్యర్థుల టికెట్ దక్కించుకున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఇప్పుడు వీరంతా టీడీపికి గుడ్ బై చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్ల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బద్దశత్రువులుగా ఉన్న కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ లు ఒకే గొడుగు కిందకు చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గొట్టిపాటి రవికుమార్ ఈసారి కరణం బలరాం తనయుడు వెంకటేష్ పై గెలుపొందారు.

అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని కరణం బలరాం అంగీకరించడం లేదు. ఒకానొక సందర్భంలో బాహాబాహికి దిగారు కూడా.

చంద్రబాబు నాయుడు సయోధ్య కుదర్చడంతో పాటు కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మెత్తబడ్డారు. ఇదిలా ఉంటే టీడీపీ క్యాడర్ గొట్టిపాటి రవికుమార్ కు సహకరించకుండా కరణం బలరాం, తనయుడు వెంకటేష్ లు పనిచేస్తున్నారంటూ గొట్టిపాటి రవికుమార్ ఆరోపిస్తున్నారు.

దీంతో కరణం వర్గీయులు సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు.  సొంతపార్టీ నేతలే సహకరించకపోవడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ప్రచారం. అద్దంకి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీహెచ్ గ‌ర‌ట‌య్య రేసులో ఉన్నారు.

2014 ఎన్నిక‌ల్లో ర‌వికుమార్ గెలుపులో గ‌ర‌ట‌య్య‌ది కీల‌క పాత్ర‌. గరటయ్య ఆర్థికంగా వీక్ కావడంతో ఆయనను పక్కన పెట్టాలని కొంతమంది నేతలు జగన్ పై ఒత్తిడితెస్తున్నారు. గరటయ్యను మారిస్తే టికెట్ కొట్టేద్దామని గొట్టిపాటి రవికుమార్ ముందే కర్చీఫ్ వేశారంటూ ఒంగోలు రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తోట త్రిమూర్తులు. చంద్రబాబు ప్రకటించిన 126 మంది అభ్యర్థుల్లో ఈయన ఒకరు. రామచంద్రాపురం అభ్యర్థిగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ తోట త్రిమూర్తులు వైసీపీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అలాగే వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్థానికేతరుడు కావడంతో ఆయన అభ్యర్థిత్వంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ప్రచారం.

వైసీపీలో పార్టీలో చేరితే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా లేదా కాకినాడ రూరల్ నుంచి పోటీ చెయ్యాలని కుమారుడు పృథ్వీరాజ్ ను రామచంద్రాపురం నుంచి పోటీ చెయ్యించాలని తోట త్రిమూర్తులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలపై వైసీపీ క్లారిటీ ఇస్తే పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ సైతం తిరిగి సొంతగూటికి చేరుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. స్థానికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న అసమ్మతి తనకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని చలమలశెట్టి సునీల్ భావిస్తున్నట్లు ప్రచారం.

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సునీల్ కు చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుస్తోంది. చలమలశెట్టి సునీల్ అనుచరులు సైతం వైసీపీ తరపున పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారట. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు సునీల్.

2014ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేస్తే పార్టీ తరపున ప్రజల్లో సానుభూతి ఉంటుందని ఫలితంగా గెలుపు ఈజీగా అవుతుందని చలమలశెట్టి సునీల్ వర్గీయులు సూచిస్తున్నారని టాక్.

ఇకపోతే నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం వైసీపీవైపు చూస్తున్నారంటూ సమాచారం. నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని తొలిసారిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలపట్ల విసుగుచెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీపై వెనక్కితగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఓట్ల తొలగింపు కేసులో  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడంలో టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఫలితంగా వైసీపీకి భారీగా సానుభూతి చోటు చేసుకుందని భావనలో ఉన్నారట.

వర్గపోరుతో నియోజకవర్గంలో టీడీపీ అచేతనంగా మారిపోయిందని దానికితోడు వైసీపీ బలంగా వేళ్లూనుకుపోవడంతో ఆయన పోటీపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండురోజులుగా తూతూ మంత్రంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని శుక్రవారం ఉదయం అలా వచ్చి ఇలా హైదరాబాద్ వెళ్లిపోయారని టాక్.

వైసీపీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరిపోతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా లేదా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ తొలిజాబితాలో చోటు దక్కించుకున్న వారిలో మంత్రి పితాని సత్యనారాయణ ఒకరు. గత కొంతకాలంగా పితాని సత్యనారాయణ వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందిన పితాని సత్యనారాయణ అనంతరం చంద్రబాబు కేబినేట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో 2014 ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని అయితే ఆ పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదని పితాని సత్యనారాయణ వర్గం భావిస్తోందట.

పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ క్యాడర్ ను సమన్వయం చేసుకోలేకపోతున్నారని ప్రచారం కూడా ఉంది. ఈ సమన్వయలోపం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పార్టీమార్పుపై గురువారం మంత్రి పితాని సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుండటం విశేషం.

ఇకపోతే ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. నిన్న ఒక్కపార్టీలో ఉన్న నేత మరుసటి రోజు ఏ పార్టీలో ఉన్నారో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.