చంద్రబాబుకు చుక్కలు చూపించిన ఒంటరిపోరు

First Published 23, May 2019, 3:17 PM

 ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలిసారిగా  ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఓటమి పాలైంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు కూడ ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ.... రెండోసారి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకొంది.
 
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1982 మార్చి 21వ తేదీన టీడీపీ ఏర్పాటైంది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ సంజయ్ విచార్ మంచ్ పార్టీతో పొత్తు పెట్టుకొంది. ఈ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్ పార్టీ తరపున కరీంనగర్ జిల్లా నుండి గోనేప్రకాష్ రావు పోటీ చేసి విజయం సాధించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతం పార్టీలో సంక్షోభానికి కారణమైంది. ఆ సమయంలో టీడీపీకి బీజేపీ, లెఫ్ట్ పార్టీలు అండగా నిలిచాయి. ప్రజమాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉద్యమాన్ని నిర్వహించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నాదెండ్ల ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. 1985లో ఎన్నికలకు వెళ్లారు.ఆ సమయంలో టీడీపీతో లెఫ్ట్, బీజేపీలు పొత్తు పెట్టుకొన్నాయి. లెఫ్ట్‌, బీజేపీ ఈ సమయంలోనే ఒకే కూటమిలో ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకొంది. 1989 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి టీడీపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఆ సమయంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

1994 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి టీడీపీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ 26 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది.

1995 లో టీడీపీలో చీలిక ఏర్పడింది. ఎన్టీఆర్ నుండి చంద్రబాబునాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు.ఈ సమయంలో లెఫ్ట్ పార్టీలు చంద్రబాబుకు అండగా నిలిచారు.1996 , 1998 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొంది.

1999 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు ఎన్డీఏకు కన్వీనర్‌గా కూడ ఉన్నారు.

చంద్రబాబునాయుడుపై 2003 అక్టోబర్ 1వ తేదీన నక్సలైట్లు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో చంద్రబాబునాయుడు తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకొన్నాడు. అసెంబ్లీ కాలపరిమితి ముగియక ముందే చంద్రబాబునాయుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు.

ఆ సమయంలో వాజ్‌పేయ్ కూడ పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాడు.ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఓటమి పాలైంది. కేంద్రంలో యూపీఏ, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఆ తర్వాత పరిణామాల్లో ఎన్డీఏ కన్వీనర్ పదవికి బాబు రాజీనామా చేశారు.బీజేపీతో పొత్తు పెట్టుకోబోనని ప్రకటించారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీడీపీ రెండోసారి ఓటమి పాలైంది.

2009 ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. ఏపీ ప్రాంతంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. కానీ, టీడీపీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు.

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొన్నాడు. ఈ ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చాడు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ కూడ ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతును ప్రకటించింది.

2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఒంటరిగా పోటీ చేశారు. వైసీపీ కూడ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ,ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీ విజయం సాధించింది.

loader