చిలకలూరిపేట నుంచి మామ పోటీ: జూ. ఎన్టీఆర్ పాత్రపై పుకార్లు

First Published 10, Mar 2019, 1:00 PM

జూ.ఎన్టీఆర్‌కు  పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావు వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి చిలకలూరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి

జూ.ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావు వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి చిలకలూరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆయన గుంటూరు లోకసభ సీటుకు పోటీ చేయవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ శాసనసభకే పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నార్నే శ్రీనివాస రావు తరఫున నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాను వైసిపిలో చేరడంతో తన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేదని నార్నే ఇప్పటికే స్పష్టం చేశారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

తన సోదరి నందమూరి సుహాసిని తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ ప్రచారం చేస్తారనే పెద్ద యెత్తునే ప్రచారం సాగింది. అయితే, ఆయన సుహాసినిని గెలిపించాలని కల్యాణ్ రామ్ తో కలిసి ఓ ప్రకటన విడుదల చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ తన మామ నార్నే తరఫున ప్రచారం చేయడానికి స్వయంగా విధించుకున్న పరిమితి ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాను తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. అందువల్ల వైసిపి తరఫున పోటీ చేసే మామకు ఆయన ప్రచారం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

నార్నే శ్రీనివాస రావు చిలకలూరిపేటలో మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మంత్రి పత్తిపాటి పుల్లారావును ఢీకొనాల్సి ఉంటుంది. అయితే, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ కత్తితోనే కోయాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని, అందువల్ల నార్నేను పోటీకి దింపాలని అనుకుంటున్నారని అంటున్నారు.

చిలకలూరిపేటలో ఇప్పటి వరకు కాంగ్రెసు ఒక్కసారి మాత్రమే గెలిచింది. తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటగా ఉన్న చిలకలూరిపేటలో నార్నే పాగా వేయగలరా అనేది వేచి చూడాల్సిందే. ఈ స్థితిలో ఎన్టీఆర్ మామను గెలిపించడానికి రంగంలోకి దిగుతారనే మాట వినిపిస్తోంది గానీ అంత నమ్మడానికి వీలు కాని పరిస్థితే ఉంది. ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. ఆయనకు ప్రచారం కొత్తేమీ కాదు గానీ టీడీపిని కాదని మరో పార్టీకి ప్రచారం చేస్తారా అనేది అసలు సిసలు సందేహం