వైసీపీ జాబితా: ఒక్క రోజు ముందే చేరినా టిక్కెట్లు, వారికి ఖేదం

First Published 17, Mar 2019, 1:33 PM

టీడీపీ నుండి ఒక్క రోజు ముందే వైసీపీలో చేరిన ఇద్దరికి వైసీపీ టిక్కెట్టు దక్కింది. కానీ, అభ్యర్థుల జాబితా విడుదలకు కొన్ని రోజుల ముందే వైసీపీలో చేరిన కీలక నేతలకు జగన్ మొండిచేయి చూపించారు.

టీడీపీలో టిక్కెట్టు దక్కినా కూడ నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ గూటికి చేరారు.శనివారం నాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ టిక్కెట్టును చంద్రబాబునాయుడు కేటాయించారు. అయితే వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని ఆ పార్టీ  కేటాయించింది.

నెల్లూరు పార్లమెంట్‌ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఆయనను కాదని  వైసీపీ నాయకత్వం టీడీపీ నుండి చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు.

ఒంగోలు ఎంపీ స్థానంలో కూడ సిట్టింగ్ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డికి బదులుగా టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టిక్కెట్టు దక్కింది. బాలినేని శ్రీనివాసులు రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో పాటు ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా జగన్  సీట్లను కేటాయించారు.

తిరుపతి ఎంపీ వరప్రసాద్‌‌ను నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానం కేటాయించారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. దుర్గాప్రసాద్‌కు తిరుపతి ఎంపీ సీటును కేటాయించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీలో ఫిరాయించగానే ఎంపీ పదవులు దక్కాయి.

ఇక వంగా గీత కూడ వైసీపీలో చేరిన మరుసటి రోజునే ఎంపీ సీటు దక్కింది. కాకినాడ నుండి ఆమె ఎంపీ టిక్కెట్టును కేటాయించింది వైసీపీ నాయకత్వం. అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు నెల రోజుల క్రితం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే రవీంద్రబాబుకు వైసీపీ టిక్కెట్టును కేటాయించలేదు. ఆయన స్థానంలో మరోకరికి ఈ స్థానాన్ని కేటాయించాడు జగన్.

ఇక అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదివారం నాడు టీడీపీలో చేరనున్నారు.ఈ స్థానం నుండి హర్షకుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన ఇద్దరు కొడుకులతో వైసీపీలో చేరారు.

అయితే ఎంపీ కానీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ దాడి కుటుంబానికి వైసీపీ కేటాయించలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి  వైసీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణ స్థానాన్ని కేటాయించారు.

శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి ఇటీవలనే వైసీపీలో చేరారు. కిల్లి కృపారాణికి వైసీపీ టిక్కెట్టు దక్కలేదు. అదే విధంగా కర్నూల్ సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో బుట్టా రేణుకకు సీటు దక్కలేదు.

రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని బాబు ఇచ్చిన హామీని తిరస్కరించి ఆమె శనివారం నాడు వైసీపీలో చేరారు. భేషరతుగానే వైసీపీలో చేరుతున్నట్టుగా ఆమె చెప్పారు..రెండు వారాల క్రితం టీడీపీ నుండి వైసీపీలో చేరిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు ఎంపీ సీటును కేటాయించారు.