రోజాకు కళ్లెం: చంద్రబాబుకు జయసుధ, జీవిత హ్యాండ్, దివ్యవాణి అస్త్రం

First Published 7, Mar 2019, 2:01 PM IST

దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి. 

ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా విమర్శలైతే ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేర్గాంచిన రోజా తనదైన శైలిలో అధికార పార్టీని ఇరుకున పెడుతున్నారు. వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో రాష్ట్రమంతా పర్యటిస్తూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు.

పింఛన్ పెంపు, పసుపు-కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.10వేలు, స్మార్ట్ ఫోన్, డ్వాక్రా రుణాలు వంటి కార్యక్రమాలు చేపట్టిన అధికార పార్టీ మహిళల ఓట్లు మనకేనంటూ చంకలు గుద్దుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే రోజా మహిళా గర్జన పేరుతో జిల్లాల వారీగా తిరుగుతూ టీడీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే మహిళలపై దాడులు జరిగాయని, హత్యలు, అత్యాచారాలు  జరిగాయని, మహిళా ఉద్యోగులపై దాడులు జరిగాయంటూ మానుతున్న గాయాలపై కారం చల్లుతున్నారు.

ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, నారాయణ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిస్తున్నారు. జగనన్న సీఎం అయితేనే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని అన్నారు.

మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని, మహిళలను కించపరిచే టీడీపీ పాలనలో చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు.

మహిళలకు మాంగల‍్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రమే అన్నా అని పిలవాలని ప్రచారం చేస్తున్నారు. రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోందట.

పసుపు-కుంకుమ, పింఛన్ పెంపు, స్మార్ట్ ఫోన్ వంటి కార్యక్రమాలతో మహిళల ఓట్లను కొల్లగొడదామని చూస్తున్న తరుణంలో రోజా వ్యాఖ్యల వల్ల ఆ ప్రయత్నాలు కాస్త బెడిసికొట్టే ప్రమాదం ఉందని టీడీపీ అంతర్మథనంలో పడిందట. ఈ నేపథ్యంలో సినీనటి దివ్యవాణిని రంగంలోకి దింపింది.

పసుపు-కుంకుమ, పింఛన్ పెంపు, స్మార్ట్ ఫోన్ వంటి కార్యక్రమాలతో మహిళల ఓట్లను కొల్లగొడదామని చూస్తున్న తరుణంలో రోజా వ్యాఖ్యల వల్ల ఆ ప్రయత్నాలు కాస్త బెడిసికొట్టే ప్రమాదం ఉందని టీడీపీ అంతర్మథనంలో పడిందట. ఈ నేపథ్యంలో సినీనటి దివ్యవాణిని రంగంలోకి దింపింది.

దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి.

దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి.

అంతేకాదు వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి ఘటన గురించి ప్రస్తావిస్తూ పిట్టకథలు చెప్పుకొచ్చారు. జగన్ పై కత్తితో దాడిని అనుసరిస్తూ చేపముళ్లు కథ చెప్పుకొచ్చారు దివ్యవాణి.

పిట్టకథలతో అందర్నీ ఆకట్టుకుంటున్న దివ్యవాణి ఎన్నికల ప్రచారంలో మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు భావించారు. అయితే చంద్రబాబు నాయుడు దివ్యవాణిపై పెట్టుకున్న ఆశలను రెండు బహిరంగ సభలలో ఆవిరి చేశారు దివ్యవాణి.

దేశవ్యాప్తంగా ఆకట్టుకునేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మా చంద్రబాబు నాయుడు వెన్నుపోటులు గురించి మాట్లాడతారా అంటూ విమర్శించిన తీరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా టంట్ స్లిప్ అయ్యారట దివ్యవాణి. దీంతో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రచారం కంటే ఆమె టంగ్ స్లిప్ అయిన వీడియోలే అత్యధికంగా సోషల్ మీడియాలో హల్ చెయ్యడంతో చంద్రబాబు ఆమె నోటికి తాళం వేశారని తెలుస్తోంది.

గతంలో కూడా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ సైతం ఎన్నో సార్లు టంగ్ స్లిప్ అయ్యారు. ప్రతిపక్షాన్ని విమర్శించాల్సింది పోయి ఎన్నోసార్లు సొంతపార్టీని విమర్శించి నాలుక్కరచుకున్నారు లోకేష్. మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా అలాగే పప్పులో  కాలేశారు లోకేష్.

దాంతో వైసీపీ పప్పు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లోకేష్ ప్రచారం పార్టీకి ఎంతమేర లాభం చేకూరుస్తోందో తెలియదు కానీ లేనిపోని చర్చకు దారి తీస్తుందని గమనించిన చంద్రబాబు లోకేష్ ను కట్టడి చేశారు. తెలుగు బాషను ప్రత్యేకించి స్పష్టంగా పలికేలా ఒక ట్యూషన్ కూడా ఏర్పాటు చేశారంటూ ప్రచారం జరిగింది.

ఆనాటి నుంచి లోకేష్ ప్రెస్ మీట్లు, బహిరంగ సభలలో మాట్లాడటం తగ్గించేశారు. ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు. అప్పుడు లోకేష్, ఇప్పుడు దివ్యవాణి ఇలా అనుకున్న వాళ్లంతా టంగ్ స్లిప్ అవుతుండటంతో చంద్రబాబు గ్లామర్ నాయకి కోసం ఎదురుచూస్తున్నారట.

ఇకపోతే త్వరలో జీవితా రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. సినీ గ్లామర్ లోటును ఆమె ద్వారా అయినా పూర్తి చేద్దామనుకున్న సమయంలో ఆమె కూడా హ్యాండ్ ఇచ్చారట. అయితే ఆమె కూడా ఇప్పుడు టీడీపీలోకి రావడం లేదని తెలిసింది.

మరోవైపు మరో సినీనటి జయసుధ సైతం తెలుగుదేశం పార్టీలోకి చేరతారంటూ ప్రచారం జరిగింది. ఇటీవలే చంద్రబాబు నాయుడును కలిసిన ఆమె టీడీపీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉండటంతో ఆమె వస్తే పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని టీడీపీ భావించింది. అయితే ఆమె చంద్రబాబు నాయుడుకు ట్విస్ట్ ఇస్తూ ఆమె గురువారం ఉదయం వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఏ మెుగుడు లేకపోతే అక్కమెుగుడే దిక్కు అన్నట్లు దివ్యవాణిపైనే ఆధారపడినట్లు తెలుస్తోంది. రోజా ఇలా జిల్లాల వారీగా తిరుగుతూ టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తే పార్టీకి మైనస్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన చంద్రబాబు దివ్యవాణినే మళ్లీ ఫోకస్ చెయ్యాలని చూస్తున్నారట. ఆమెకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి రోజాపై వదలాలని వ్యూహరచన చేస్తున్నారట. కొద్ది రోజులుగా మీడియాకు దివ్యవాణి దూరంగా ఉండటానికి కారణం అదేనని తెలుస్తోంది.

అయితే ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష అనంతరం దివ్యవాణి దాదాపు కనిపించడం మానేశారు. మీడియావైపు కన్నెత్తి చూడటం లేదు. విమర్శల కోసం, బహిరంగ వేదికలపై ఎలా మాట్లాడాలి అనే అంశాలపై టీడీపీ శిక్షణాతరగతుల్లో తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.

దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

loader