చంద్రబాబుకు వారసుల ‘పోటు’: తిప్పలు తప్పవా..!!

First Published 14, Mar 2019, 3:49 PM

అసలే టికెట్లు ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్థంకాక తలపట్టుకుంటున్న చంద్రబాబు నాయుడుకి ఫ్యామిలీ ప్యాకేజీ కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. పార్టీలో కీలక నేతలు రెండేసి సీట్లు ఆశించడం పెద్ద సమస్యగా మారింది. 

అభ్యర్థులను ఎంపిక చెయ్యడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించే చంద్రబాబు నాయుడుకు ఫ్యామిలీ ప్యాకేజీ అంశం తలబొప్పికట్టిస్తోందట. టికెట్ ఇస్తే ఇవ్వండి లేకపోతే...అంటూ చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారట ఆయా నేతలు

తనకంటే గట్టి నాయకుడు ఉంటే చూసుకోండంటూ లేచి బయటకు వచ్చేస్తున్నారని ప్రచారం. దీంతో వారిని ఎలా సంతృప్తి పరచాలో తెలియక చంద్రబాబు నాయుడు తల పట్టుకుంటున్నారట. ఇకపోతే అనంతపురం జిల్లాలో మెుదలైన ఈ రెండేసి టికెట్ల వ్యహారం ఆఖరుకి విజయనగరం జిల్లాకు చేరుకుంది

చంద్రబాబు నాయుడు కేబినేట్లో మంత్రిగా పనిచేస్తున్న పరిటాల సునీత మెుదటి నుంచి రెండు సీట్లు ఆశిస్తున్నారు. రాప్తాడు, కళ్యాణదుర్గం సీట్లు కావాలంటూ పట్టుబడుతున్నారు. రాబోయే ఎన్నికల్లోనే తన కుమారుడు శ్రీరామ్ ను ఎన్నికల బరిలోకి దించాలని వ్యూహరచన చేస్తున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో అలిగిన ఆమె తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల ప్రచారంలో రాప్తాడు నుంచి తనయుడు శ్రీరామ్ పోటీ చేస్తున్నాడని ఆశీర్వదించాలంటూ చెప్పుకొచ్చారు

అప్పటికే రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు కేటాయించడంతో ఖంగుతిన్న చంద్రబాబు నాయుడు పరిటాల సునీతకు కబురుపంపారని తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్ కాకుండా మంత్రి పరిటాల సునీతకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది

దీంతో చంద్రబాబు సునీతకే టికెట్ కేటాయించారని టీడీపీ అధిష్టానం చెప్తోంది. ఇకపోతే అదే జిల్లా నుంచి రెండేసి టికెట్లు ఆశించారు జేసీ బ్రదర్స్. కానీ చంద్రబాబు నిరాకరించడంతో వారసులను బరిలోకి దించాలని ప్రయత్నాలు మెుదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌కు గట్టి పట్టుండటంతో చంద్రబాబు నాయుడు కాస్త తగ్గక పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గం టికెట్ ను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డికి  కేటాయించారు

అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా తనయుడు పవన్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తన కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు రెండు రోజులు సమయం అడిగారని తెలుస్తోంది

ఇకపోతే రాజకీయాల్లో సీనియర్ నేత అయిన నరసరావుపేట ప్రస్తుత ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం ఫ్యామిలీ ప్యాకేజీ అడుగుతున్నారు. ఆయన తనయుడు రంగబాబును బరిలోకి దించాలని యోచిస్తున్నారు. తనయుడు కోసం ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీటుకే ఎసరుపెట్టేందుకు రెడీ అయ్యారు

కోడెల ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనయుడు రంగరాజును బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో సత్తెనపల్లి టికెట్ పై పట్టుబడుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా రాయపాటిని ఎంపిక చేస్తానని కుమారుడికి మాత్రం టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట చంద్రబాబు.

అంతేకాదు సత్తెనపల్లి టికెట్ కోడెల శివప్రసాదరావుకు కేటాయించారు సీఎం చంద్రబాబు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. పక్కదారి చూడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ చెప్పి కోపంతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది

మరోవైపు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం తన తనయుడుని అసెంబ్లీ బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారట. తనయుడు శివరామ్ ను నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యించాలని ప్రయత్నిస్తున్నారట.

ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. సత్తెనపల్లి నియోజకవర్గంలో నీపై అసమ్మతి తీవ్రంగా ఉందని నీ సీటుపైనే ఆలోచిస్తుంటే తనయుడికి సీటా అంటూ చంద్రబాబు అనడంతో కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తోంది

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన ఎస్పీ వైరెడ్డి సైతం రెండు సీట్లు అడుగుతున్నారు. తన రాజకీయ వ్యవహారాలు చూసుకుంటున్న ఆయన అల్లుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు

అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని మహిళా కోటాలో తన కుమార్తె సుజలకు నంద్యాల ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. కుమార్తె, అల్లుడు వద్దు అని మీరే పోటీ చెయ్యాలని ఎస్పీ వై రెడ్డికి సూచించారట చంద్రబాబు. అయితే ఈ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది

టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సైతం తన కుమారుడిని బరిలోకి దించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2019ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి తన కుమారుడిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు

ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం కల్పించిన నేపథ్యంలో కుమారుడికి టికెట్ అంటే కాస్త ఆలోచించండి అని చెప్పి పంపించేశారట. ఇకపోతే ఇదే సీటుపై తిరిగి పోటీ చెయ్యాలని పట్టుదలతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. సీటు తనదంటే తనదేనని పోటీ పడుతున్నారు

అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు పోటీపడుతున్న నేపథ్యంలో ఎటూ తేల్చలేక చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు. కార్యకర్తల అభిప్రాయం, సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పడంతో ఇద్దరు నేతలు కాస్త శాంతించారని తెలుస్తోంది

ఉత్తరాంధ్రలో మరో కీలక నేత మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం రెండు టికెట్లు కావాలని మెలిక పెట్టారు. తనయుడు విజయ్ కు అనకాపల్లి పార్లమెంట్ సీటు, తనకు నర్సీపట్నం టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే నర్సీపట్నం నుంచి మీరే పోటీ చెయ్యాలని అయ్యన్నపాత్రుడుకు సూచించారట చంద్రబాబు నాయుడు

అయితే తాను పోటీ చెయ్యనని నర్సీపట్నం నుంచి తనయుడు విజయ్ పోటీ చేస్తారంటూ చెప్పుకొచ్చారట. దీంతో ఏం చెయ్యాలో తెలియక చంద్రబాబు నాయుడు తర్జనభర్జన పడుతున్నారట. రాబోయే ఎన్నికల్లో కేవలం అయ్యన్నపాత్రుడు మాత్రమే పోటీ చెయ్యాలని విజయ్ కి మరోసారి అవకాశం ఇస్తానని సర్దిచెప్పారట. అయితే అయ్యన్నపాత్రుడు మాత్రం ససేమిరా అంటూ కూర్చున్నారట.

ఇకపోతే చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నేత మాజీమంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సైతం ఫ్యామిలీ ప్యాకేజీ అడుగుతున్నారు. తన అనారోగ్యం దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తన కుమారుడు సుధీర్ కు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు

ఇలా వారసుల రాజకీయ రంగ ప్రవేశం, ఫ్యామిలీ ప్యాకేజీలతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీపై అలగడంతోపాటు పార్టీ మారాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట చంద్రబాబు