చంద్రబాబు హ్యాండ్ ఇస్తారా: ఇలా చేశారేంటి, ఆందోళనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

First Published 14, Mar 2019, 1:55 PM

కర్నూలు: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక అనేది ఆయా పార్టీలకు పెద్ద సవాల్ గా మారుతోంది. అంతేకాదు ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో అన్నది చెప్పలేని పరిస్థితి.

అయితే గతంలో ఇలానే టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ నేతల పరిస్థితి తెలుగుదేశంలో దయనీయంగా మారింది. 2019 ఎన్నికల్లో తమకే టికెట్ అనిభావించిన వారికి చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తున్నారు.

ఇప్పటికే చాలా మందికి హ్యాండిచ్చిన చంద్రబాబు నాయుడు మరికొంతమందిని కూడా పక్కనపెట్టనున్నారని తెలుస్తోంది. అవకాశం ఉన్న నేతలు కనీసం ఆ టికెట్ అయినా ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు ప్రసన్నం కోసం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

కర్నూలు జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే వారికి 2019 ఎన్నికల్లో టికెట్లు లభించడం పెద్ద గగనంగా మారింది.

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ కు పోటీ చేసి గెలుపొందారు. ఆమె గెలుపొందిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. పార్టీ కండువాకప్పుకోనప్పటికీ టీడీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు.

టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరికి వైసీపీనే విమర్శల దాడికి దిగిన సందర్భాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో మళ్లీ తిరిగి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేద్దామని భావించిన ఆమెకు చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు.

కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి బుట్టా రేణుక టికెట్ ఆయనకి ఇచ్చేశారు. ఇక బుట్టా రేణుకను ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడంపై విముఖత చూపినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అంగీకరించారు.

తొలుత ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలంటూ ఆదేశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని ఇవ్వనని తెగేసి చెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడు మళ్లీ జయనాగేశ్వర్ రెడ్డికే టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి.

మళ్లీ ఆదోని నుంచి పోటీ చెయ్యాలని ఆదేశించారు. సరే అనుకునే సరికి మీనాక్షినాయుడు ఉన్నారు సర్వే నివేదిక ఆధారంగా టికెట్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. చివరికి ఆ సీటు అయినా దక్కుతుందా అంటూ కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు బుట్టా రేణుక.

అమరావతిలోనే మకాం వేసిన ఆమె చంద్రబాబు నాయుడును కలిసి అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. అయితే ఆదోని సీటు మీనాక్షి నాయుడుకే దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.

కర్నూలు అసెంబ్లీ నుంచి గెలుపొందిన ఈయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయన టికెట్ విషయంపైనా క్లారిటీ లేకుండా పోతుంది. ఎస్వీ మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అంటూ ధైర్యంగా ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనయుడు భరత్ గట్టి పోటీ ఇస్తుండటంతో తన టికెట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నాలుగురోజులుగా అమరావతిలోనే మకాం వేసిన ఆయన చంద్రబాబు నాయుడును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అటు టీజీ వెంకటేష్ సైతం కర్నూలు అసెంబ్లీ టికెట్ తన కుమారుడికే ఇప్పించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మరో కీలక నేత ఎస్వీవై రెడ్డి. 2014 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి దయనీయంగా మారింది.

నంద్యాల ఎంపీ, నంద్యాల అసెంబ్లీ, ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని తెలుస్తోంది. తన అల్లుడు శ్రీధర్ లేదా కుమార్తెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వాలని కోరారు.

అయితే అసెంబ్లీకి పోటీ తీవ్రంగా ఉండటంతో కష్టమని చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారట. కనీసం పరిశీలనలో కూడా వీరి పేర్లు తీసుకోలేదని తెలుస్తోంది. ఇకపోతే నంద్యాల ఎంపీ టికెట్ అయినా తిరిగి తనకు ఇవ్వాలని లేదా తన కుటుంబ సభ్యులకు అయినా ఇవ్వాలని చంద్రబాబు నాయుడును కలిశారు.

రెండు రోజుల క్రితం నుంచి వరుసగా కలుస్తున్నా చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి చెప్పడం లేదని ఆయన మదనపడుతున్నారని తెలుస్తోంది. నంద్యాల నుంచి బలమైన అభ్యర్థి కోసం చంద్రబాబు నాయుడు అన్వేషిస్తున్నారని ఎవరూ దొరకని పక్షంలో ఎస్వీ వై రెడ్డికే కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్యే మణిగాంధీ. 2014 ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన మణిగాంధీ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు.

అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థిగా మణిగాంధీ విషయంలో కనీసం చంద్రబాబు స్పందించలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం.

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవికొట్టేసిన మంత్రి భూమా అఖిలప్రియ తన వర్గానికి పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె వాపోయారట. అఖిలప్రియ తనకు సీటు దక్కించుకున్నా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిల సీట్లపై నెలకొన్న సందిగ్ధతపై ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట.