మురళీ మోహన్ వ్యాఖ్యలు: జగన్ కు ఊరట, చంద్రబాబుకు దెబ్బ

First Published 13, Mar 2019, 1:05 PM

హైదరాబాద్: రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీ మోహన్ ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చారు. సినిమావాళ్లు కేసీఆర్ కు భయపడి వైసిపిలో చేరుతున్నారని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారు. దాన్ని మురళీ మోహన్ ఖండించారు.

మురళీమోహన్ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఊరటను ఇచ్చే విధంగా ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబుకు శరాఘాతంగా మారే సూచనలు కనిపిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీ అయిన మురళీమోహన్ ఆ విధంగా మాట్లాడడం చంద్రబాబుకు మింగుడుపడని విషయమే.

మురళీ మోహన్ ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.  రాజమండ్రి సీటు నుంచి మరోసారి పోటీ చేయడానికి ఆయన ఇష్టపడడం లేదు. అంత మాత్రాన ఆయన ప్లేటు ఫిరాయించారని అనుకోవడానికి లేదు. సినీ ప్రయోజనాలే మురళీ మోహన్ కు ప్రాధాన్యం కావడం చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించడానికి కారణం కావచ్చు.

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ ను ఆ మధ్య కలిశారు. దాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు సినిమా నటులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రోద్బలంతో వైసిపిలోకి వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది బహుశా అందరు సినీ ప్రముఖులను బాధపెట్టే ఉంటుంది. అయితే, వారు బయటపడలేదు.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిన ప్రముఖ సినీ నటి జయసుధ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగానే ప్రతిస్పందించారు. హైదరాబాదులో తనకేమీ ఆస్తులు లేవని, సినిమావాళ్లపై చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. రాజకీయాలతో సంబంధాలు లేని సినీ ప్రముఖులు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదిస్తున్నా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదని సమాచారం

మురళీ మోహన్ కు కూడా హైదరాబాదులో ఆస్తులున్నాయి. పైగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. జయభేరి సంస్థ కార్యకలాపాలు హైదరాబాదు కేంద్రంగానే సాగుతుంటాయి. దానివల్ల ఆయన కెసిఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించాల్సి వచ్చిందా, తన సహచరుల పక్కన నిల్చోవడానికి అలా మాట్లాడాల్సి వచ్చిందా అనేది చర్చనీయాంశంగా మారింది.