కార్టూన్ పంచ్: యూఎస్ vs ఇరాన్

First Published 10, Jan 2020, 3:28 PM

ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. ప్రపంచమంతా కూడా ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు తగ్గాలని కోరుకుంటున్నారు. మధ్యప్రాచ్యంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాల వల్ల చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మనదేశంలో ఆ ప్రభావం వల్ల చమురు రేట్లు పెరగడమే కాకుండా షేర్ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఈ రెండు దేశాల మధ్య అప్పటికే కొనసాగుతున్న వైరానికి మరింత ఆద్యం పోశాయి. ఇరాన్ రష్యాకు మిత్రుడిగా మారిపోతే... సౌదీ ఏమో అమెరికాకు అత్యంత మిత్ర దేశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్యప్రాచ్య ప్రాంతమంతా ఎప్పుడు కూడా నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది.

loader