జగన్ తురుపు ముక్కలు: వైఎస్ షర్మిల, విజయమ్మ ప్రచారం

First Published 13, Mar 2019, 2:27 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో నువ్వా నేనా అన్నట్లు జరిగే ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా చాలా పకడ్బందీగా నడిపించాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో నువ్వా నేనా అన్నట్లు జరిగే ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా చాలా పకడ్బందీగా నడిపించాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు

తల్లి వైఎస్ విజయమ్మతో పాటు సోదరి వైఎస్ షర్మిల కూడా ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలున్నాయి. అవసరాన్ని వివిధ నియోజకవర్గాల్లో వారు ప్రచారం సాగిస్తారని అంటున్నారు. వారిద్దరు కూడా పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉంది.

వైఎస్ విజయమ్మ గత ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అది ఒక రకంగా జగన్ కు శరాఘాతమే అయింది. తల్లిని కూడా గెలిపించుకోలేని పార్టీ నేతగా ఆయనపై ముద్రపడింది. ఈసారి ఆమెను ఎన్నికలకు దూరంగానే ఉంచాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వైఎస్ షర్మిలను కర్నూలు పార్లమెంటు సీటు నుంచి పోటీకి దించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ జగన్ అందుకు సిద్ఘంగా లేరని తెలుస్తోంది. ఆమెను సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారానికి వాడుకునే అవకాశాలున్నాయి. జగన్ వదిలిన బాణంగా ఆమె రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగించే అవకాశాలున్నాయి.

వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలను ప్రచారానికి దించితే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వండని వారు కోరే అవకాశం ఉంది