కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి?

First Published 27, Feb 2019, 5:19 PM

కాంగ్రెసుకు షాక్: వైసిపిలోకి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి?

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అన్నది తెలియడం కష్టంగా మారింది. ఇటీవలే ఒక ప్రముఖ రాజకీయవేత్త అన్నట్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు అన్నదానిపై మాత్రం చెక్ చేసుకోవాల్సి వస్తోంది ఆ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. మెున్న కేంద్రమాజీమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, నిన్న కిల్లి కృపారాణి, క్యూ కట్టిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతుంది. ఆమెతోపాటు ఆమె భర్త మాజీ ఇండియన్ రైల్వే ఉద్యోగి పనబాక కృష్ణయ్యతోపాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పనబాక లక్ష్మీ, ఆమె భర్త కృష్ణయ్యలు తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పనబాక లక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగుతున్నారు. నెల్లూరు  జిల్లా కావలిలో జన్మించిన ఆమె మూడు పర్యాయాలు నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. ఒకసారి ప్రకాశం జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 11, 12,14 లోక్ సభలకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు.

15వ లోక్ సభకు బాపట్ల నుంచి ప్రాతినిథ్యం వహించారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా, కేంద్ర పెట్రోలియం శాఖ మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అడ్రస్ గల్లంతైంది

2014 ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుపొందలేదు. 2014లో బాపట్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మీ ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇకపోతే ఆమె భర్త పనబాక కృష్ణయ్య రైల్వే శాఖలో ఉన్నత ఉద్యోగి. అయితే పదవీవిరమణ అనంతరం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2009లో గుంటూరు జిల్లా గూడూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండో స్థానంలో నిలిచారు. ఇకపోతే 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. దాదాపుగా రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్నారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా కోలుకోలేదని భావిస్తున్నారు పనబాక లక్ష్మీ. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే బాపట్ల పార్లమెంట్ టికెట్ వచ్చేదని ఆమె భావించింది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ఏపీలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలియడంతో ఇక వారు పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడకే ప్రశ్నార్థంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

jaganరాబోయే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో బలమైన అభ్యర్థుల కోసం వేటాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితో ఫలితం ఉంటుందని వారు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థి అవసరం ఉంది

2014 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరికూటి అమృతపాణి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

అలాగే గుంటూరు జిల్లా గూడురు నియోజకవర్గంలో కూడా బలమైన అభ్యర్థి కోసం జగన్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గూడురు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సునీల్ కుమార్ గెలుపొందారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

ఈ పరిణామాల నేపథ్యాలను గమనించిన కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ, ఆమె భర్త కృష్ణయ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీకి చెందిన కీలక నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. పనబాక లక్ష్మీకి బాపట్ల పార్లమెంట్ సీటు, ఆమె భర్త కృష్ణయ్యకు గూడురు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కండీషన్స్ పెట్టారట.

అయితే వైఎస్ జగన్ లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. వైఎస్ జగన్ లండన్ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకోవడం, గృహప్రవేశం కూడా చెయ్యడంతో ఆయనతో నేరుగా చర్చించాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు పనబాక లక్ష్మీ భర్త కృష్ణయ్యలతో తెలుగుదేశం పార్టీ నేతలు సైతం టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రిగా మంచి గుర్తింపు పొందడం, బాపట్ల ఎంపీ గా గెలుపొందడంతో ఆమె చేరితే పార్టీకి మంచిదేనని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీలు భావిస్తున్నాయి. మరి పనబాక ఫ్యామిలీ ప్యాక్ కు ఏ పార్టీ అంగీకరించి సీట్లు ఇస్తుందో ఆ పార్టీకే జై కొడతారని తెలుస్తోంది.

పనబాక లక్ష్మీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బేనని చెప్పుకోవాలి. ఇటీవలే కేంద్ర మాజీమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, త్వరలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం, రేపు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రెండు రోజుల్లో పనబాక లక్ష్మీ ఇలా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పుకోవచ్చు.