కదిరి సీటు కుస్తీ: చంద్రబాబు వర్సెస్ బాలకృష్ణ

First Published 27, Feb 2019, 6:08 PM

కదిరి సీటు కుస్తీ: చంద్రబాబు వర్సెస్ బాలకృష్ణ

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద సవాల్ గానే మారిందని చెప్పుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులు రెచ్చిపోతున్నారు. అధినేత చంద్రబాబు ఆదేశాలను సైతం లెక్కచెయ్యకుండా తిరుగుబాటుకు దిగుతున్నారు.

కొంతమంది రోడ్లెక్కి నిరసనలు తెలుపుతుంటే మరికొందరు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని సంతృప్తి పరుస్తూ వస్తున్న చంద్రబాబుకు ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ టికెట్ ముప్పు తిప్పలు పెడుతుందట. కనిగిరి టికెట్‌ తనకే కావాలంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావు పట్టుబడుతున్నారు.

ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని తనకే టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుతో చెప్పుకొచ్చారట. సీటు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసునని చంద్రబాబు కదిరి బాబూరావుకు చెప్పారట. దీంతో సమావేశం నుంచి బయటకు వచ్చేసిన ఆయన ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుంటే పార్టీ వీడతానంటూ నానా హంగామా చేసేశా

చంద్రబాబు తనకే టికెట్ ఇవ్వాలంటే ఎవరితో చెప్పిస్తే నిర్ణయం మార్చుకుంటారో వారితో చెప్పించాలని నిర్ణయం తీసుకున్నారట. ఆయనే చంద్రబాబు నాయుడు వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతోనే కదిరి బాబూరావు గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు.

దీంతో ఆయన చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు ఫోన్‌ చేశారు. దీంతో బాలకృష్ణ తన బావ సీఎం చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేసి తాను కలవడానికి వస్తున్నానంటూ సమాచారం పంపారట. ఇదంతా మంగళవారం రాత్రి జరిగిన సీన్.

మంగళవారం ఒంగోలు పార్లమెంట్ సమీక్ష సమావేశంలో భాగంగా కనిగిరి నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టికెట్ పై ఇరువురితో చర్చించారు.  (కదిరి బాబూరావు అండ్ ఉగ్రనరసింహారెడ్డి) ఈ చర్చల్లో చంద్రబాబు నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామంటూ హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని అప్పటి వరకు ఇద్దరూ నియోజకవర్గంలో కలిసి పనిచెయ్యాలని ఆదేశించారు. దాంతో కదిరి బాబూరావు ఎమ్మెల్యే సీటు తనకే ఇవ్వాలని ఉగ్ర నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పుకొచ్చారట.

ఇప్పుడే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇంతలోనే మాట మారిస్తే ఎలా అని చంద్రబాబు కదిరి బాబూరావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కదిరి బాబూరావు సమావేశం నుంచి అలిగి వచ్చేశారట. పార్టీ అధిష్టానంపై నానా దూషణలకు దిగారట.

కదిరి బాబూరావు తీరుతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే దివిశివరాంలు ఆశ్చర్యానికి గురయ్యారట. టికెట్‌ ఇవ్వకపోతే ఈ పార్టీ అక్కరలేదంటూ గట్టిగా అరిచారట. అక్కడి నుంచే చంద్రబాబు వియ్యంకుడు  బాలకృష్ణకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పారట.

దీంతో బాలకృష్ణ సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేశారని అమరావతికి వస్తున్నానంటూ చెప్పారట. బాబూరావుకే టికెట్‌ ఇవ్వాలని బాలకృష్ణ పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఫోన్ తో అలర్ట్ అయిన చంద్రబాబు కదిరి బాబూరావుకు కనిగిరి టికెట్ ఇచ్చి ఉగ్రనరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దింపితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అంశంపై ఆరా తీశారని సమాచారం.

బాలకృష్ణ ఒత్తిడికి చంద్రబాబు నాయుడు తలొగ్గి కదిరి బాబూరావుకు కనిగిరి టికెట్ ఇస్తే ఉగ్ర నరసింహారెడ్డి పరిస్థితి ఏంటి...ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న చర్చ తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో జోరుగా సాగుతోందట.