MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? 3200 కోట్ల స్కామ్ ఏంటి?

Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? 3200 కోట్ల స్కామ్ ఏంటి?

MP Mithun Reddy Arrested: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. మద్యం కుంభకోణంలో సిట్‌ విచారణ తర్వాత ఆయ‌న‌ను అరెస్ట్ చేసి కుటుంబానికి సమాచారం అందించారు. ఆస‌లు ఏంటి ఈ ఏపీ లిక్క‌ర్ స్కామ్? సిట్ విచార‌ణ‌లో ఏం తేలింది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2025, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైకాపా ఏంపీ మిథున్ రెడ్డి అరెస్టు
Image Credit : Facebook/Peddireddy Midhun Reddy

వైకాపా ఏంపీ మిథున్ రెడ్డి అరెస్టు

వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఆంధ్ర మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. సిట్ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) అరెస్ట్ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఏడుగంటలపాటు సాగిన విచారణ అనంతరం ఆయనను శనివారం అరెస్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏపీ లిక్క‌ర్ స్కామ్: సిట్ విచారణలో కీలక విషయాలు
Image Credit : Facebook/Peddireddy Midhun Reddy

ఏపీ లిక్క‌ర్ స్కామ్: సిట్ విచారణలో కీలక విషయాలు

సిట్ అధికారులు మిథున్‌రెడ్డి 7 గంట‌ల‌కు పైగా విచారించారు. డొల్ల కంపెనీల సృష్టి, అవినీతిమార్గంలో ముడుపుల పంపిణీ, లిక్కర్ పాలసీ రూపకల్పనలో అతని పాత్రపై వివరణ కోరారు. 

ముఖ్యంగా డొల్ల కంపెనీల ద్వారా సొమ్ములు ఎవరికి చేరాయన్న అంశంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రైవేట్ సమావేశాల వివరాలు కూడా సిట్ అధికారులు విచారించారని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

36
రూ.3,200 కోట్ల స్కామ్‌, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరణ
Image Credit : Facebook/Peddireddy Midhun Reddy

రూ.3,200 కోట్ల స్కామ్‌, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరణ

2019–2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ మద్యం కుంభకోణం మొత్తం రూ.3,200 కోట్ల అంచనాగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ తిరస్కరణకు గురికావడంతో సుప్రీంకోర్టు కు వెళ్లారు. అక్కడ కూడా ఆయన కు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఎల్వోసీ జారీ చేసి ఆయన పరారయ్యే అవకాశాన్ని ముందుగా అంచనా వేస్తూ సిట్, చివరికి ఆయనను అరెస్ట్ చేసింది.

46
300 పేజీలతో ప్రాథ‌మిక‌ చార్జ్‌షీట్
Image Credit : Facebook/Peddireddy Midhun Reddy

300 పేజీలతో ప్రాథ‌మిక‌ చార్జ్‌షీట్

ఈ కేసులో సిట్ దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్ దాదాపు 300 పేజీలతో ఉండగా, 100కి పైగా ఫోరెన్సిక్ నివేదికలు RFSL నుంచి పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు, 268 మంది సాక్షులను విచారించినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది మద్యం వ్యవస్థలో జరిగిన అవినీతికి బలమైన ఆధారాలుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

56
ఏపీ లిక్క‌ర్ స్కామ్ అరెస్టుల జాబితాలో 12 మంది
Image Credit : Facebook/Peddireddy Midhun Reddy

ఏపీ లిక్క‌ర్ స్కామ్ అరెస్టుల జాబితాలో 12 మంది

ఏంపీ మిథున్‌రెడ్డితో పాటు ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (A1), స్పై ఆగ్రో ఎండీ సజ్జల శ్రీధర్‌రెడ్డి (A6), భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, మాజీ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ OSD పి.కృష్ణమోహన్‌రెడ్డి వంటి పలువురు ఉన్నారు. ఇంకా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సంబంధించి విచారణ కొనసాగుతోంది.

66
హీటెక్కిన ఆంధ్ర రాజ‌కీయాలు.. మద్యం పాలసీ మార్పుపై విమర్శలు
Image Credit : Facebook/Peddireddy Midhun Reddy

హీటెక్కిన ఆంధ్ర రాజ‌కీయాలు.. మద్యం పాలసీ మార్పుపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీలో ఆన్‌లైన్ నుంచి మాన్యువల్ విధానానికి మారడంలో మిథున్‌రెడ్డి పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనివల్ల పారదర్శకత తగ్గి, డొల్ల కంపెనీల ద్వారా అక్రమ ఆదాయం సృష్టించారని ఆరోపణలు వ‌చ్చాయి. ఈ కేసు విచార‌ణ మొదలు.. ప్రస్తుత అరెస్టుల ప‌ర్వంతో ఆంధ్ర రాజ‌కీయాలు హీటెక్కాయి.

ఏపీ రాజకీయాలను షేక్ చేసిన మద్యం స్కామ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ స్థాయి వ్యక్తి అరెస్టు కావడం, ఇతర ప్రముఖులపై విచారణ కొనసాగుతుండటంతో, త్వరలోనే మరిన్ని కీలక మలుపులు తిరగనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
అమరావతి
విజయవాడ
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
Google Pixel 10 Series: అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. భారత్ లో ధ‌రలు ఎంత‌?
Recommended image2
Colleges Bandh : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థల బంద్... ఒక్కరోజు కాదు రెండ్రోజులు సెలవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved