- Home
- Business
- Google Pixel 10 Series: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. భారత్ లో ధరలు ఎంత?
Google Pixel 10 Series: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. భారత్ లో ధరలు ఎంత?
Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టు 20న విడుదల కానుంది. నాలుగు మోడళ్లు, కొత్త టెన్సర్ చిప్, మెరుగైన కెమెరాలు సహా అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధరలు సహా ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

ఆగస్టు 20న గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ విడుదల
గూగుల్ తన పిక్సల్ సిరీస్ కొత్త మోడల్ విడుదలకు సిద్ధంగా ఉంది. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. "మెయిడ్ బై గూగుల్" ఈవెంట్ 2025 ఆగస్టు 20 జరగనుంది.
ఈ ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్‌కి చెందిన నాలుగు మోడళ్లను గూగుల్ విడుదల చేయనుంది. అదరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ లిస్టులో గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ విడుదల లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ విడుదల ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌కు కు సంబంధించి ఇప్పటికే పలువురు ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అధికార యూట్యూబ్ ఛానెల్, వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఈవెంట్ ను లైవ్‌లో చూడవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ నుంచి కొత్తగా ఏం ఆశించవచ్చు?
ఈ సారి గూగుల్ టెన్సర్ జీ5 (Tensor G5) పేరుతో తయారు చేసిన కొత్త ప్రాసెసర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది TSMC 3nm తయారీ ప్రక్రియ ఆధారంగా రూపొందించినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ చిప్ తో పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు మెరుగైన పనితీరు, తక్కువ వేడి ఉత్పత్తి చేయడం,మెరుగైన ఎనర్జీ ఎఫిషియెన్సీని అందిస్తాయని సమాచారం. టెన్సర్ 5 ఈ సిరీస్ లోని పాత ప్రాసెసర్ల కంటే 25 శాతం వేగంగా పని చేస్తుందని అంచనా.
ఇక ఇతర ఫీచర్ల విషయానకి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10లో 12GB ర్యామ్ ఉండనుందని సమాచారం. ఇక ప్రో, ప్రో ఎక్స్‌ఎల్ మోడళ్లలో 16GB వరకు ర్యామ్ ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ విషయంలో 128GB నుంచి 1TB వరకు ఆప్షన్లు ఉంటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పిక్సెల్ 10 సిరీస్ లో అదిరిపోయే కెమెరా ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ ఫోన్లలో కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సారి పిక్సెల్ 10 బేసిక్ మోడల్‌లోనే టెలిఫోటో లెన్స్ తీసుకువస్తుండటం ప్రత్యేకత. ఇది గతంలో ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితంగా ఉండేది. అయితే, ప్రధాన, అల్ట్రా-వైడ్ కెమెరాలు కాస్త తగ్గవచ్చని టెక్ నిపుణులు ఊహిస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 10, 10 ప్రో, 10 ప్రో ఎక్స్‌ఎల్‌లో 50MP ప్రాథమిక కెమెరా, రెండు 48MP సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు కెమెరా విషయానికొస్తే, ఫోల్డ్ మోడల్‌ను తప్ప మిగతా మూడింటిలోనూ 42MP సెల్ఫీ కెమెరా ఉంటుందని అంచనాలున్నాయి.
ఫోల్డ్ మోడల్‌లో 48MP ప్రాథమిక కెమెరా, 10.5MP అల్ట్రా వైడ్, 10.8MP టెలిఫోటో సెన్సార్ (5X జూమ్‌తో) ఉండబోతున్నాయని పలు లీక్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ డిజైన్, డిస్ ప్లే ఎలా ఉండనుంది?
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ డిజైన్ గతం లోని పిక్సెల్ 9 సిరీస్ స్టైల్ లోనే ఉండనుంది. అయితే, హారిజాంటల్ కెమెరా బార్, అల్యూమినియం ఫ్రేమ్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటాయి. అన్ని మోడళ్లలో IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది.
డిస్ ప్లే పరిమాణం గత మోడళ్లతో సమానంగా ఉండే అవకాశం ఉంది. పిక్సెల్ 10, 10 ప్రోలో సుమారు 6.3 అంగుళాలు, ప్రో ఎక్స్‌ఎల్‌లో 6.7 అంగుళాలు డస్ ప్లే ఉంటుందని సమాచారం. ప్రో మోడల్ 120Hz LTPO OLED ప్యానెల్స్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ తో తీసుకురావచ్చు.
ఫోల్డ్ మోడల్ కవర్ డిస్ ప్లే కొంచెం పెరగనుంది. 6.4 అంగుళాలు ఉంటుంది. అన్ని మోడళ్లలో కొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధరలు ఎంత?
పలు లీక్‌లు, ఊహాగానాల ప్రకారం భారత మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధరలు ఈ విధంగా ఉండే అవకాశముంది..
గూగుల్ పిక్సెల్ 10 - రూ. 79,999 నుండి ప్రారంభం కానుంది
గూగుల్ పిక్సెల్ 10 ప్రో - రూ. 90,600
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ - రూ. 1,17,700
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ - రూ. 1,79,999
ఇవి అధికారిక ధరలు కావు కానీ, దాదాపు ఇవే ధరలు ఉంటాయని పలు లీక్ లు పేర్కొంటున్నాయి. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర భారీగా ఉంటుందనీ, దానికి తగ్గట్టుగానే అందులో ఫీచర్లు ఉంటాయని సమాచారం. దీనిని సామ్‌సంగ్, వివో వంటి బ్రాండ్ల ఫోల్డబుల్ ఫోన్లతో పోటీగా ఉంచే ప్రయత్నం చేస్తోంది గూగుల్.