MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: అన్నపై చెల్లి మాస్‌ ర్యాగింగ్‌.. జనాలు ఛీ కొడుతున్నా జగన్‌ మారలేదంటూ ఫైర్‌

Andhra Pradesh: అన్నపై చెల్లి మాస్‌ ర్యాగింగ్‌.. జనాలు ఛీ కొడుతున్నా జగన్‌ మారలేదంటూ ఫైర్‌

జగన్‌ మోహన్‌ రెడ్డి వర్సెస్‌ షర్మిల ఎపిసోడ్‌ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు జగన్‌ను టార్గెట్‌ చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది..   

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 24 2025, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ షర్మిల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇంట్లో మొదలైన ఆర్థిక సమస్యలను కాస్త షర్మిల రచ్చకు తీసుకొచ్చారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఓటమికి షర్మిల కూడా ఒక కారణమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారంటేనే వీరి మధ్య వైరం ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్నికల తర్వాత కూడా జగన్‌ను షర్మిల టార్గెట్‌ చేస్తూనే ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

11 నిమిషాలు ఉండడానికే అసెంబ్లీకి వచ్చింది.? 

సోమవారం మొదలైన అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరై కాసేపటికే వాకవుట్‌ చేసి వెళ్లిపోవడంపై షర్మిల ఫైర్‌ అయ్యారు. జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రెడ్డి గారి తీరు మాత్రం మారలేదని ధ్వజమెత్తారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యల కంటే మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ? అంటూ ఫైర్‌ అయ్యారు. 

ఇక ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారంటూ తనదైన శైలిలో పంచ్‌లు పేల్చింది. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నాం. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్‌ చేశారు. మరి షర్మిల చేసిన కామెంట్స్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 

33
YS Sharmila

YS Sharmila

గవర్నర్‌ ప్రసంగంలో పసలేదు: 

గవర్నర్‌ ప్రంసంగంపై కూడా షర్మిల స్పందించారు. గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదని, దిశా-నిర్దేశం అంతకన్నా లేదన్నారు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని, సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదన్నారు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదన్న షర్మిల, మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు గారి విజన్ 2047కి దమ్ము లేదన్నారు. 

8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదన్నారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందన్న షర్మిల.. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయని, 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు? తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ గారు చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవన్నారు. మొత్తం మీద అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Recommended image3
Now Playing
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు | YS Sharmila Meets YS Jagan | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved