- Home
- Andhra Pradesh
- YS Jagan vs Vijayasai Reddy : జగన్ ... అసలు నీకు క్యారెక్టర్ ఉందా : విజయసాయి మనసులో మాట ఇదేనా?
YS Jagan vs Vijayasai Reddy : జగన్ ... అసలు నీకు క్యారెక్టర్ ఉందా : విజయసాయి మనసులో మాట ఇదేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వీరిద్దరిది రాజకీయ బంధమే కాదు ఆర్థిక బంధం కూడా. అలాంటిది వీరిద్దరి మధ్య మాటలయుద్దం సాగుతోంది. తాజాగా జగన్ కు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

YS Jagan vs Vijayasai Reddy
Vijayasai Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారాన్ని కోల్పోయిందో లేదో అలా వలసలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసారు... వీరిలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా వున్నారు.
వైసిపిలో వైఎస్ జగన్ తర్వాత స్థానం ఎవరిదంటే విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తుంది. అలాంటి నాయకుడు పార్టీని వీడటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అతడు వైసిపి సభ్యత్వానికే కాదు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసారు. తాను ఏ పార్టీలో చేరబోనని... వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు విజయసాయి తెలిపారు. జగన్ తో సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు.
అయితే తన మాట వినకండా పార్టీ కష్టకాలంలో వుండగా రాజీనామా చేసిన విజయసాయిపై వైఎస్ జగన్ పీకలదాకా కోపంతో వున్నట్లు అర్థమవుతోంది.తాజాగా ఎంపీల రాజీనామా గురించి కాస్త ఘాటుగా స్పందించారు వైఎస్ జగన్. దీనికి మాజీ ఎంపి విజయసాయి రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇలా గతంలో అత్యంత సన్నిహితులుగా వున్న జగన్, విజయసాయి రెడ్డి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఇలా కౌంటర్లు వేసుకుంటున్నారు. అయితే తాజాగా విజయసాయి రెడ్డి ట్వీట్ మాత్రం జగన్ వ్యక్తిగత జీవితమే టార్గెట్ గా వుంది.
YS Jagan vs Vijayasai Reddy
ఇంతకూ విజయసాయి రెడ్డి ఏమన్నారంటే :
తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి రాజ్యసభ సభ్యులు పార్టీ మారడంపై మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ప్రస్తావన తెచ్చారు. మొత్తం 11 మంది ఎంపీల్లో విజయసాయి రెడ్డితో కలిసి నలుగురు వెళ్ళిపోయారని అన్నారు. ఇలా వెళ్లిపోయేవారికి ఒకటే చెబుతున్నా... రాజకీయాల్లో క్యారెక్టర్, విశ్వసనీయత చాలా ముఖ్యమని అన్నారు.
పలానావాడు తమ నాయకుడని కాలర్ ఎగరేసి చెప్పేలా వుండాలని జగన్ పేర్కొన్నారు. కానీ ప్రలోబాలకు లొంగి లేదంటే భయపడి క్యారెక్టర్ ను ఫణంగా పెట్టకూడదని అన్నారు. ఇలాచేస్తే మనపై గౌరవం పోతుందన్నారు. రాజకీయాల్లో రోజులు ఒకేలా వుండవు... కష్టం అనేది ఎక్కువకాలం వుండదన్నారు. ఐదేళ్లు ఓపిక పడితే అయిపోయేదని పార్టీవీడిన ఎంపీలను ఉద్దేశించి జగన్ కామెంట్ చేసారు.
వైఎస్ జగన్ కామెంట్స్ విజయసాయి రెడ్డికి గట్టిగా తాకినట్లున్నాయి. అందుకే ఆయన జగన్ తో ఇంతకాలంగా ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా మరిచి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎక్స్ వేదికన స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు.
''వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా'' అంటూ విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారు.
<p>Vijayasai Reddy</p>
విజయసాయి రెడ్డి ట్వీట్ అంతరార్థం ఇదేనా?
విజయసాయి రెడ్డి తన ట్వీట్ ద్వారా జగన్ కు చురకలు అంటించారు. రాజకీయ జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ క్యారెక్టర్ వుందని... మరి మీ సంగతి ఏంటి అనేలా విజయసాయి కామెంట్స్ వున్నారు. జగన్ రాజకీయాల గురించి ప్రస్తావిస్తే విజయసాయి మాత్రం వ్యక్తిగత జీవితంలో కూడా తనకు విలువలు, విశ్వసనీయత వున్నాయని చెప్పుకొచ్చారు. తద్వారా జగన్ కు వ్యక్తిగత జీవితంలో విలువలు లేవని చెప్పదల్చుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.
ఇక రాజకీయ జీవితంలో తాను భయమంటూ ఎరుగనని... అందుకే ధైర్యంగా పార్టీ పదవులకే కాదు ఎంపీగా కూడా రాజీనామా చేసానన్నారు. తాను ఎవరి ప్రలోబాలకు లొంగలేదని... ఆ అవసరం తరకు లేదని చెప్పుకొచ్చారు. ఇలా వైఎస్ జగన్ కు కౌంటర్ గా విజయసాయి చేసిన ట్వీట్ లో చాలా మీనింగ్ దాగివుందని వైసిపి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.