MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : నైరుతి ఔట్, ఈశాన్యం ఇన్... ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే..!

IMD Rain Alert : నైరుతి ఔట్, ఈశాన్యం ఇన్... ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే..!

IMD Rain Alert : వర్షాకాలం ముగిసినా వర్షాలు మాత్రం విడిచిపెట్టడంలేదు. తెలుగు రాష్ట్రాలను మరికొన్నిరోజులు వర్షాలు అతలాకుతలం చేస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 17 2025, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇప్పటివరకు వర్షాలే... ఇప్పట్నుంచి చల్లని వర్షాలు
Image Credit : X/APSMDA

ఇప్పటివరకు వర్షాలే... ఇప్పట్నుంచి చల్లని వర్షాలు

IMD Rain Alert : నిన్నటితో (అక్టోబర్ 16, గురువారం) నైరుతి రుతుపవనాలకు ఎండ్ కార్డ్ పడిపోయింది. దేశంనుండి ఈ రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయని... మరికొన్నిరోజుల్లో ఇవి దేశంమొత్తంలో విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో చలిగాలులు పెరగడంతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.. అంటే ఇంతకాలం వర్షాలే... కానీ ఇప్పుడు చల్లని గాలులతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించే అవకాశాలు ఉన్నాయన్నమాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏపీలో వర్షాలు కురిసే జిల్లాలివే
Image Credit : Getty

ఏపీలో వర్షాలు కురిసే జిల్లాలివే

ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నేడు (శుక్రవారం, అక్టోబర్ 17)న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్క వర్షాలు కురుస్తాయని తెలిపింది.

36
ఈదురుగాలులతో కూడిన వర్షాలు
Image Credit : Asianet News

ఈదురుగాలులతో కూడిన వర్షాలు

ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడయి ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది APSDMA (Andhra Pradesh Disaster Management Authority). ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దంటూ ముందుజాగ్రత్తలు సూచించింది ఏపి విపత్తు నిర్వహణ సంస్థ.

46
నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ
Image Credit : ANI

నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ

గురువారం(16 అక్టోబర్ 2025)న నైరుతి రుతుపవనాలు దేశం నుండి పూర్తిగా నిష్క్రమించాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దేశంలో మే 24న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని... ఆంధ్రప్రదేశ్ లోకి రెండ్రోజుల తర్వాత అంటే మే 26న ప్రవేశించాయని వెల్లడించింది. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం జరుగుతోందని... ఇకపై చలిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు రానురాను మరింత పడిపోతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

56
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
Image Credit : ANI

నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే నేడు (శుక్రవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

66
హైదరాబాద్ ను వణికిస్తున్న చలి
Image Credit : X/Meteolorgical Centre

హైదరాబాద్ ను వణికిస్తున్న చలి

ఇక హైదరాబాద్ లో శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పొగమంచుతో కూడిన చల్లని వాతావరణం ఉంటుందని... కనిష్టంగా నగరం, శివారు ప్రాంతాల్లో 19 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గరిష్టంగా 31 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పంలో రైతు బజార్ ప్రారంభించిన CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image3
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఇంకా అల్పపీడనాలు, వాయుగుండాల గండం పొంచివుందా..? అక్టోబర్ లోనూ అల్లకల్లోలం తప్పదా?
Recommended image2
Rain Alert: ఇక కాస్కోండి.. ఈ ప్రాంతాల్లో ఆగ‌మాగం, ఆకాశంలో అల్ల‌క‌ల్లోలం. భారీ వ‌ర్షాలు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved