MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Viral Video: వెంకీ మామా డైలాగ్ ను షేర్ చేసిన చంద్రబాబు.. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ పోస్ట్

Viral Video: వెంకీ మామా డైలాగ్ ను షేర్ చేసిన చంద్రబాబు.. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ పోస్ట్

Viral Video: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు గుర్తురాగానే ఎప్పుడూ సీరియ‌స్‌గా ఉంటార‌నే భావ‌న క‌లుగుతుంది. అయితే ఇలాంటి వ్య‌క్తి తాజాగా సోష‌ల్ మీడియా ఎక్స్ లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 26 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చంద్రబాబు షేర్ చేసిన ఫ‌న్నీ వీడియో
Image Credit : Asianet News

చంద్రబాబు షేర్ చేసిన ఫ‌న్నీ వీడియో

ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, పర్యటనలు, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి సోషల్ మీడియాలో సరదా వీడియోను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసిన ఓ ఏఐ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. "ఈ వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేకపోతున్నా" అంటూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కలెక్టర్ కుర్చీలో చిన్నారి.. సీఎంతో కాల్
Image Credit : N Chandrababu Naidu/X

కలెక్టర్ కుర్చీలో చిన్నారి.. సీఎంతో కాల్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ కుర్చీలో కూర్చుని కనిపిస్తుంది. ఆమె ముందు "ఆర్నా IAS – విశాఖపట్నం" అనే నేమ్‌ప్లేట్, జాతీయ జెండా, ల్యాప్‌టాప్ ఏర్పాటు చేసి నిజమైన కార్యాలయ వాతావరణాన్ని సృష్టించారు. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై సీఎం చంద్రబాబు వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఏఐ సాయంతో రూపొందించారు.

35
'నువ్వు నాకు నచ్చావ్' సినిమా డైలాగ్‌తో మరింత సరదా
Image Credit : N Chandrababu Naidu/X

'నువ్వు నాకు నచ్చావ్' సినిమా డైలాగ్‌తో మరింత సరదా

ఈ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరో వెంకటేష్ చెప్పిన ప్రసిద్ధ కామెడీ డైలాగ్. చిన్నారి తన తండ్రి కిటికీలో కనిపించగానే, "బై సీబీఎన్ అంకుల్... నేనిప్పుడు మీతో మాట్లాడలేను... టీవీ కట్టేసి, నన్ను క్షమించు నాన్నా... నిన్ను వెయిట్ చేయించానని ఆయన కాళ్ల మీద పడ్డా" అనే సినిమా డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించేలా వీడియోను రూపొందించారు. ఈ డైలాగ్‌కు తగ్గట్టుగా చిన్నారి చేసిన హావభావాలు వీడియోకు మరింత వినోదాన్ని జోడించాయి.

45
ఫిదా అవుతోన్న నెటిజన్లు
Image Credit : N Chandrababu Naidu/X

ఫిదా అవుతోన్న నెటిజన్లు

వీడియోలో చిన్నారి ఎంతో అమాయకంగా సీఎం చంద్రబాబుకు చేతి ఊపుతూ వీడ్కోలు చెప్పడం, అదే సమయంలో ఆమె తండ్రి ప్రేమగా కూతురిని చూస్తూ నిలబడటం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఏఐ టెక్నాలజీని వినోదాత్మకంగా ఉపయోగించి రూపొందించిన ఈ వీడియో నెటిజ‌న్లు ఆక‌ట్టుకుంటోంది.

It’s impossible to watch this video and not smile! I'm officially rooting for Aarna. 😊 pic.twitter.com/Hm3LjRGZfM

— N Chandrababu Naidu (@ncbn) June 26, 2026

55
చంద్రబాబు పోస్టుతో మరింత వైరల్
Image Credit : N Chandrababu Naidu/X

చంద్రబాబు పోస్టుతో మరింత వైరల్

ఈ వీడియోను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్న వెంటనే అది వేగంగా వైరల్ అయింది. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు చేసే సీఎం, ఈసారి సరదా వీడియోను షేర్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చిన్నారి అమాయకత్వం, 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా డైలాగ్, ఏఐతో చేసిన క్రియేటివ్ ఎడిటింగ్ కలిసివచ్చి ఈ వీడియోను నెట్టింట ట్రెండింగ్‌గా మార్చేశాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Recommended image2
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu
Recommended image3
Now Playing
జగన్ మత మార్పిడులపై Vijaysai Reddy Sensational Comments | Asianet Telugu
Related Stories
Recommended image1
Motivational Story: ఈరోజు నువ్వు చేసేదే... రేపు నీకు తిరిగి వస్తుంది. మనసును కదిలించే కథ
Recommended image2
పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved