- Home
- Andhra Pradesh
- TTD News: కొత్తగా పెళ్లైన వారికి తిరుమలలో ప్రత్యేక దర్శనం.? కీలక ప్రకటన చేసిన టీటీడీ అధికారులు.
TTD News: కొత్తగా పెళ్లైన వారికి తిరుమలలో ప్రత్యేక దర్శనం.? కీలక ప్రకటన చేసిన టీటీడీ అధికారులు.
తిరుమల వెంకన్నను ప్రతీ రోజూ వేలాది మంది దర్శించుకుంటారు. ఈ ఆలయానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఇలాంటి ఓ వార్తపై టీటీడీ అధికారికంగా స్పందించింది.

కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేక దర్శనం
కొత్తగా పెళ్లి జరిగిన జంటకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభిస్తుందని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. పెళ్లైన వారంలోపు ఫోటోలు, ఆధార్ కార్డులు చూపిస్తే క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా స్వామివారి దర్శనం కల్పిస్తారంటూ సందేశాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టతనిచ్చింది.
ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన
సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ప్రచారంపై టీటీడీ అధికారికంగా స్పందించింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇలాంటి ప్రత్యేక దర్శనాలు ఏవీ లేవని, అబద్ధపు ప్రచారాలను భక్తులను నమ్మకూడదని ప్రకటించింది. ప్రస్తుతం రూ.300 టికెట్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, అంగప్రదక్షిణం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల ద్వారా దర్శన అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వీటికి అదనం గా కొత్త జంటలకు ప్రత్యేక దర్శనం అనే పద్ధతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.
⚠️ Fake News Alert ⚠️
TTD appeals to devotees not to believe or share the fake information circulating about “Newly Married Couple Darshan” at Tirumala.
For official updates, follow only TTD channels.#TTDevasthanams#FakeNewsAlertpic.twitter.com/No6cP6b5YU— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 4, 2025
చంద్రగ్రహణం కారణంగా ఆలయ మూసివేత
ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి జరిగిన చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని భక్తులకు మూసివేశారు. సెప్టెంబర్ 8న రాత్రి 9.50 గంటల నుంచి సెప్టెంబర్ 9 ఉదయం 1.31 గంటల వరకు గ్రహణం కొనసాగింది. అందువల్ల ఆలయం సాయంత్రం 3.30 గంటలకే మూసివేశారు. శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి, సోమవారం ఉదయం 3 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరిచి భక్తులకు దర్శనాన్ని ప్రారంభించారు.
అన్నప్రసాదం పంపిణీ పునఃప్రారంభం
గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను శుద్ధి అనంతరం సోమవారం ఉదయం తిరిగి తెరిచారు. ఉదయం 8.30 గంటల నుంచి మళ్లీ అన్నప్రసాద పంపిణీ ప్రారంభమైంది.
జయంతి, వర్థంతి వేడుకలు
సెప్టెంబర్ 10న ప్రముఖ పండితులు, సేవాధారులు అయిన గౌరి పెద్ది రామసుబ్బశర్మ 103వ జయంతి, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రీ 44వ వర్థంతిని టీటీడీ నిర్వహించింది. తిరుపతిలోని విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, అనంతరం అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో పండితుల స్మారక సభలు నిర్వహిచారు.