MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Tirupati: తిరుమలలో AI టెక్నాలజీకి టీటీడీ శ్రీకారం

Tirupati: తిరుమలలో AI టెక్నాలజీకి టీటీడీ శ్రీకారం

Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు టీటీడీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 22 2025, 10:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏఐ టెక్నాలజీ
Image Credit : our own

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏఐ టెక్నాలజీ

Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానము (టీటీడీ) ఏఐ టెక్నాల‌జీని వినియోగించ‌నుంది. భక్తుల దర్శన అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అత్యాధునిక టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) జె. శ్యామలారావు గురువారం ప్రకటన చేశారు.

ఈవో వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత విధానాలను ఉపయోగించి భక్తులను ధృవీకరించనున్నారు. దాంతో పాటు, దొంగ పాస్‌లను, భక్తుల పేర్లను వాడి జరిగే మోసాలను నిరోధించడమే లక్ష్యంగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిరుమలలో అత్యుత్తమ టెక్నాలజీని వాడుతాం : టీటీడీ
Image Credit : our own

తిరుమలలో అత్యుత్తమ టెక్నాలజీని వాడుతాం : టీటీడీ

“టీటీడీ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీ పరిష్కారాలను, ముఖ్యంగా AI ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి భక్తుల యాత్రను మరింత సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని శ్యామలారావు పేర్కొన్నారు.

35
తిరుమలలో నకిలీ టిక్కెట్లు, బుకింగ్ మోసాలకు చెక్ పెట్టే చర్యలు
Image Credit : our own

తిరుమలలో నకిలీ టిక్కెట్లు, బుకింగ్ మోసాలకు చెక్ పెట్టే చర్యలు

ఈ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా భక్తులకు సమయానుకూల దర్శన టోకెన్లు జారీ చేయబడతాయి. ప్రతి భక్తుని ముఖ చిత్రం తీసి, గత 30 రోజుల్లో సేకరించిన దాదాపు 10 లక్షల చిత్రాలతో అనుసంధానం చేసి, నకిలీ బుకింగ్‌లను అడ్డుకుంటారు.

ఈ విధానం ద్వారా టోకెన్ జారీ, ధృవీకరణ ప్రక్రియ వేగంగా, సమస్యలులేకుండా పూర్తవుతుంది. దీంతో నకీలీ టిక్కెట్లు, బుకింగ్ మోసాలకు పూర్తిగా చెక్ పడుతుంది.

45
తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
Image Credit : our own

తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ

ముఖ గుర్తింపు టెక్నాలజీని క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, ఆలయ అంతర్గత ప్రాంతాల్లో భక్తుల సంఖ్యను గమనించడానికి కూడా ఉపయోగిస్తారు. AI ఆధారిత కెమెరాలు భక్తుల కదలికలను రియల్ టైంలో గుర్తించి, దర్శన సమయాన్ని అంచనా వేసేందుకు సహాయపడతాయి.

“ఈ విధానం ద్వారా భక్తులు క్యూ లైన్‌లో చేరినప్పుడు తగిన సమాచారం పొందవచ్చు. వారు తమ యాత్రను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు” అని ఈవో తెలిపారు.

55
శ్రీవారి భక్తుల సేవల్లో పారదర్శకత, సమర్థత, భద్రతను పెంచే చర్యలు
Image Credit : our own

శ్రీవారి భక్తుల సేవల్లో పారదర్శకత, సమర్థత, భద్రతను పెంచే చర్యలు

అలాగే, AI కెమెరాల ద్వారా దర్శన మార్గాల్లో అనవసర ఖాళీలు లేదా ఆపరేషనల్ లోపాలను గుర్తించి సరిచేయవచ్చు. భవిష్యత్‌లో తిరుమలలో చొరబాటుదారులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కీలకంగా ఉపయోగపడనుంది. మొత్తంగా, శ్రీవారి భక్తుల సేవల్లో పారదర్శకత, సమర్థత, భద్రతను పెంచే లక్ష్యంతో ఈ టెక్నాలజీని అన్ని విభాగాల్లో విస్తరించనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image3
రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Related Stories
Recommended image1
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
Recommended image2
Tirumala : ఇక ఈ రైలెక్కితే చాలు.. చాలా తొందరగా తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved