అన్నొస్తున్నాడు అన్నారు... వచ్చి ఏం పీకాడు: సీఎం జగన్ పై లోకేష్ ఫైర్
First Published Dec 29, 2020, 2:02 PM IST
19 నెలల పాలనలో 767 రైతుల్ని మింగి ఇప్పుడు రైతుకి ముందే సంక్రాంతి వచ్చింది అని దొంగ పేపర్ లో దొంగబ్బాయ్ ప్రకటన ఇచ్చారని.నారా లోకేష్ మండిపడ్డారు.

ప్రకాశం: రైతుల సమస్యల గురించి తెలుసుకునేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(మంగళవారం) ఆయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మేడపి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యల గురించి తెలుసుకున్నారు నారా లోకేష్.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... అన్నొస్తున్నాడు అన్నారు...వచ్చాడు... వచ్చి ఏమి పీకాడంటూ విమర్శించారు. 19 నెలల పాలనలో 767 రైతుల్ని మింగాడన్నారు. రైతుకి ముందే సంక్రాంతి వచ్చింది అనిదొంగ పేపర్ లో దొంగబ్బాయ్ ఈ రోజు ప్రకటన ఇచ్చారని... ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పండగ ముందే వచ్చింది అనడానికి జగన్ రెడ్డికి సిగ్గుందా? అని మండిపడ్డారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?