- Home
- Andhra Pradesh
- పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, మనదగ్గరే పోస్టింగ్.. తెలుగు యువతకు సూపర్ ఛాన్స్
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, మనదగ్గరే పోస్టింగ్.. తెలుగు యువతకు సూపర్ ఛాన్స్
Central Government Jobs : కేంద్ర ప్రభుత్వ వైద్య పరిశోధన సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగం చేసే అద్భుత అవకాశం… కాబట్టి అర్హత గల తెలుగు యువత వెంటనే అప్లై చేసుకొండి.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
Government Jobs : భారతదేశంలోని ప్రముఖ క్యాన్సర్ చికిత్స, పరిశోధన కేంద్రం టాటా మొమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ముంబై ప్రధానకేంద్రం దేశంలోని వివిధ నగరాల్లో ఈ TMC కార్యకలాపాలు సాగిస్తుంది... విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ సెంటర్ కూడా దీని పరిధిలోనిదే. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో మెడికల్ సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మంచి సాలరీతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కాబట్టి యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి... ఉద్యోగం వస్తేచాలు లైఫ్ సెట్ అయినట్లే.
ఈ నోటిఫికేషన్‌లో ఫిమేల్ నర్స్ ‘A’, నర్స్ ‘A’, స్టెనోగ్రాఫర్, ఫిమేల్ వార్డెన్, కిచెన్ సూపర్‌వైజర్, కుక్ – ‘A’, అటెండెంట్, ట్రేడ్ హెల్పర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్ లాంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి మొత్తం 330 ఖాళీల భర్తీ నోటిఫికేషన్స్ ప్రకటించారు. విశాఖపట్నంతో పాటు దేశంలోకి వివిధ నగరాల్లో పోస్టింగ్ ఉంటుంది… ఎంపికైన వారికి అర్హతను బట్టి జీతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిలాగే ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
TMC ఉద్యోగాలకు విద్యార్హతలు
టాటా మమోరియల్ సెంటర్ లో చాలా తక్కువ విద్యార్థతలతో కూడా ఉద్యోగాలున్నాయి. అభ్యర్థులు పోస్టును బట్టి 10వ తరగతి ఉత్తీర్ణత నుంచి ఏదైనా డిగ్రీ, GNM, B.Sc (నర్సింగ్) లాంటి వివిధ విద్యార్హతలు కలిగి ఉండాలి. కాబట్టి పదో తరగతి పాసైన వారి నుంచి పట్టభద్రుల వరకు అందరికీ ఇందులో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
టాటా మెమొరియల్ సెంటర్ ఉద్యోగాలకు వయోపరిమితి
టాటా మెమొరియల్ సెంటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 18 ఏళ్లు నిండి, 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి, ఎస్టి వర్గాలకు 5 ఏళ్లు, ఓబిసి వర్గాలకు 3 ఏళ్ల వయోపరిమితిలో సడలింపులు కూడా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళలకు కూడా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం
దరఖాస్తు ప్రక్రియ 16.10.2025 నుండి మొదలయ్యింది... 14.11.2025 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఇతర వర్గాల వారు రూ.300/- చెల్లించాలి. అయితే మహిళలు, ఎస్సి, ఎస్టి, మాజీ సైనికులు, పిడబ్ల్యుడి వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. కాబట్టి అర్హతలు కలిగినవారు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విషయానికొస్తే అభ్యర్థులను రాత పరీక్ష (Written Examination), నైపుణ్య పరీక్ష (Skill Test), ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు 14.11.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు TMC అధికారిక వెబ్‌సైట్ https://tmc.gov.in/ ద్వారా దరఖాస్తును పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, మీ అర్హతను నిర్ధారించుకోవడం అవసరం.
సాలరీ
ఎంపికైన పోస్టు, ఇతర అర్హతలను బట్టి నెలకు రూ.18,000/- నుంచి రూ.44,900/- వరకు జీతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.