MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Srivarshini- lady aghori: అవును సహజీవనం చేస్తున్నా.. నా మొగుడు అఘోరీనే.. శ్రీవర్షిణి షాకింగ్‌ కామెంట్స్‌!

Srivarshini- lady aghori: అవును సహజీవనం చేస్తున్నా.. నా మొగుడు అఘోరీనే.. శ్రీవర్షిణి షాకింగ్‌ కామెంట్స్‌!

Srivarshini- lady aghori: లేడీ అఘోరీ శ్రీవర్షిణి లవ్‌స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా దర్శకులు సైతం వీరిస్తున్న ట్విస్టులను చూసి ఇది కదా కథంటే అనేలా చేస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే పంచయతీ సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్‌ చదువుతున్న శ్రీవర్షిణి, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న లేడీ అఘోరీ లేపుకుపోవడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురును అమాయకురాలని లేడీ అఘోరీ వశీకరణం చేసి లేపుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేశారని బీటెక్‌ గార్ల్‌ శ్రీవర్షిణి చెప్పడం సంచలనంగా మారింది. ఏది నిజం... ఎవరు చెబుతున్నది వాస్తవం అన్న విషయాలపై ఎనాలసిస్‌ మీరూ చదవండి.. 
 

Bala Raju Telika | Published : Apr 12 2025, 11:29 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Srivarshini- lady aghori

Srivarshini- lady aghori

లేడీ అఘోరీ శ్రీవర్షిణి లవ్‌స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా దర్శకులు సైతం వీరిస్తున్న ట్విస్టులను చూసి ఇది కదా కథంటే అనేలా చేస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే పంచయతీ సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్‌ చదువుతున్న శ్రీవర్షిణి, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న లేడీ అఘోరీ లేపుకుపోవడం సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురును అమాయకురాలని లేడీ అఘోరీ వశీకరణం చేసి లేపుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులే దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేశారని బీటెక్‌ గార్ల్‌ శ్రీవర్షిణి చెప్పడం సంచలనంగా మారింది. ఏది నిజం... ఎవరు చెబుతున్నది వాస్తవం అన్న విషయాలపై ఎనాలసిస్‌ మీరూ చదవండి.. 

25
Srivarshini- lady aghori

Srivarshini- lady aghori

లేడీ అఘోరీ, శ్రీవర్షిణి ఈ ఇద్దరి మధ్య ఓ పెద్ద కథ నడుస్తోందని స్పష్టం తెలుస్తోంది. రోజుకో మాట.. పూటకో అబద్దంలా సోషల్‌ మీడియాలో ఏదోరకంగా కనిపిస్తోంది. శ్రీవర్షిణికి అయితే మానసిక సమస్యలు లేవు కానీ.. అలాగే మెచ్యూరిటీ లెవల్స్‌ మాత్రం అస్సలు లేవు. ఓ మాయా ప్రపంచంలో బతికేస్తోంది. భవిష్యత్తుపై పెద్ద క్లారిటీ కూడా లేదు అన్నదే ఆమె మాటల్లో అర్థమవుతోంది. ఈజీగా మనీ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెబుతున్న కొన్ని విషయాల్లో తెలుస్తోంది. నిన్న, మొన్నటి వరకు అఘోరి వద్దకు నేను వెళ్లని అని చెప్పిన అమ్మాయి సడెన్‌గా ఇప్పడు అఘోరితో ఉంటాను అంటోంది. రీసెంట్‌గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

35
Srivarshini- lady aghori

Srivarshini- lady aghori

ఇంట్లో నుంచి అఘోరితో ఉంటానని వెళ్లి పోయిన శ్రీవర్షిణి గుజరాత్‌లో వాళ్ల అన్నయ్యలకు చిక్కడం అఘోరి వద్ద నుంచి వాళ్లు తీసుకురావడం జరిగిపోయింది. ఇంతటితో కథ ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే కథలో రెండో భాగం మొదలైంది. శ్రీవర్షిణి కుటుంబానికి సన్నిహితంగా ఉండే విష్ణునే అనే వ్యక్తి వద్ద ఉందట. అతను ఆమెను తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లడం లేదు అలాగని అఘోరి వద్దకు పంపడం లేదని ఆమె అంటోంది. అసలు ఈ విషయం టీవీ ఛానల్‌ స్టూడియోకి వచ్చే చెప్పే బదులు శ్రీవర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా అనే అనుమానం అందరికీ కలుగుతోంది. కానీ ఎందుకు చెప్పదంటే.. 

45
Srivarshini- lady aghoriSrivarshini- lady aghori

Srivarshini- lady aghoriSrivarshini- lady aghori

లేడీ అఘోరీతో పెళ్లి జరిగిందని శ్రీవర్షిణి అంటోంది. ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో, రెండోసారి ఇంట్లోనే పెళ్లి అయ్యిందని చెబుతోంది. లేడీ అఘోరీ తాళి కూడా కట్టిందని అంటోంది. అయితే... మరి ఈ విషయం ఇన్ని రోజులు అఘోరి, శ్రీవర్షిణి, ఆమె తల్లిదండ్రులు కానీ ఎందుకు చెప్పలేదన్నది సస్పెన్స్‌గా ఉంది. ఇక చెన్నై నుంచి అఘోరి గోల్డ్‌ చైన్‌ తీసుకొచ్చి తన మెడలో వేసిందని శ్రీవర్షిణి అంటోంది. ఆమె తల్లిదండ్రుల కూడా అఘోరీని కోడలు పిల్లా అని పిలిచినట్లు చెబుతోంది. అంత అన్యోన్యంగా ఉంటున్న క్రమంలో విష్ణు అనే వ్యక్తి వచ్చి అంతా పాడు చేశాడని, తల్లిదండ్రుల మనసు కూడా మార్చేశాడని అంటోంది. 

 

55
Srivarshini- lady aghori

Srivarshini- lady aghori

ఫైనల్‌గా అఘోరీతోనే కలిసి ఉంటాయని శ్రీవర్షిణి చెబుతోంది. అఘోరి ఆడ, మగ కాకపోయినా తనకు ఇష్టమేనని, సెక్స్‌ తనకు ముఖ్యంకాదని అంటోంది. పిల్లలను అనాథాశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకుంటమంటున్నారు. జీవితాంతం అఘోరీతో సహజీవనం చేస్తానని వర్షిణి చెబుతోంది. మొత్తానికి అఘోరీ చెంతకు వర్షిణి వెళ్లిపోయింది. ఇక కథ అంతా చూస్తే.. విష్ణు అనే వ్యక్తి ప్రభావం శ్రీవర్షిణిపై కుటుంబంపై ఉందని తెలుస్తోంది. విష్ణు, అఘోరీ మధ్య వర్షిణి జీవితం నలిగిపోతుంది అని మాత్రం అనిపిస్తోంది. 

Bala Raju Telika
About the Author
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత. Read More...
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories