బైబై ట్రెండ్... వర్కౌట్ అయిన పవన్ స్లోగన్
ఎన్నికల ప్రచారంలో ‘#HelloAP_ByeByeYCP’ అంట పవన్ చేసిన స్లోగన్ ట్రెండింగ్ అవుతోంది. వైసీపీ ఘోర పరాభవానికి పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారన్నది నిర్వివాదాంశం.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ట్రెండ్ అర్థమైంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా లీడ్స్ కొనసాగింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కూటమి విజయ పథం తర్వాత... ప్రస్తుతం పవన్ కల్యాణం నినాదం వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో ‘#HelloAP_ByeByeYCP’ అంట పవన్ చేసిన స్లోగన్ ట్రెండింగ్ అవుతోంది. వైసీపీ ఘోర పరాభవానికి పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారన్నది నిర్వివాదాంశం.
Pawan Kalyan
ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధిస్తూ.. ప్రచారాన్ని హోరెత్తించారు. తమ గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై డైలాగ్ వార్ జరిపారు. ఈ క్రమంలో ట్రెండ్ అయిన, ట్రోలింగ్‌కు గురైన డైలాగ్‌లా చాలా ఉన్నాయి.
2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల ప్రచారం నిర్వహించారు. అప్పట్లో బైబై బాబు (#ByeByeBabu) పదేపదే స్లోగన్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితం కాగా, జగన్ నాయకత్వంలోని వైసీపీ 151 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా బైబై బాబు నినాదం వైసీపీకి అప్పట్లో అనుకూలించింది....
Pawan Kalyan
ఆ తర్వాత ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైబై కేసీఆర్ (#ByeByeKCR) అంటూ ప్రతిపక్ష క్యాంపెయిన్ నడిచింది. టాటా, బైబై అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ట్రెండీ స్లోగన్స్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ అధికారం కోల్పోగా... కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాలు ప్రధానంగా యువత ఆకట్టుకున్నాయి. 'జగన్ గుర్తుపెట్టుకో.. అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు. నా పార్టీ జనసేనే కాదు..' అంటూ చేసిన ప్రసంగాలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్‌లో ఉన్నాయి.