మనల్నెవడ్రా ఆపేది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయం.. భారీ మెజారిటీ సాధించిన జనసేనాని.

పిఠాపురంలో చరిత్ర సృష్టిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రత్యర్ధి సమీపంలో కూడా రాకుండా పవర్ స్టార్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. 
 

Power Star Pawan Kalyan Wins In Pithapuram with highest Majority JMS


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్న మాటలను నిలబెట్టుకున్నాురు. ఎవడ్రా మనల్ని ఆపేది.. బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 

 కౌంటింగ్ ముగిసే సరికి పవర్ స్టార్ 70  వేలకు పైగా  మెజారిటీతో దూసుకుపోతున్నారు. దాంతో .. ఇక్కడ పవన్ గెలుపు ఖాయం అయిపోయింది. ఇక రాష్ట్రం అంతా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 15 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార్ విజయంతో పాటు.. దాదాపు 20సీట్లు సాధిస్తోన్న జనసేనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతే కాదు మెగా ప్యామిలీతో పాటు.. ఇండస్ట్రీలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. 

ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, నితిన్, డైరెక్టర్ హరీష్ తోపాటు.. పలువురు ట్విట్టర్ వేదికగా.. మనల్నెవడ్రా ఆపేది అంటూ.. పండగ చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాన్  మంత్రి వర్గం  ఉండటం తో పాటు.. మంత్రి వర్గ కూర్పు గురించి కూడా క్లారిటీ రాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios