MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో అల్ప‌పీడ‌నం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో అల్ప‌పీడ‌నం.. 4 రోజులు భారీ వ‌ర్షాలు. ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 29 2026, 09:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బలపడనున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్
Image Credit : Gemini AI

బలపడనున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, సమీప నికోబార్ దీవుల పరిసరాల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. తొలుత సుస్పష్టమైన అల్పపీడనంగా మారి, శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేశారు. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదివారం, సోమవారం భారీ వర్షాలు
Image Credit : Gemini AI

ఆదివారం, సోమవారం భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఆదివారం, సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

35
శుక్రవారం, శనివారం ఈ జిల్లాల్లో వర్షాలు
Image Credit : Gemini AI

శుక్రవారం, శనివారం ఈ జిల్లాల్లో వర్షాలు

శుక్రవారం (అక్టోబర్ 30) అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేశారు. శనివారం (అక్టోబర్ 31) విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

45
ఆదివారం, సోమవారం జిల్లాల వారీగా వర్ష సూచన
Image Credit : Gemini AI

ఆదివారం, సోమవారం జిల్లాల వారీగా వర్ష సూచన

ఆదివారం (నవంబర్ 1) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

సోమవారం (నవంబర్ 2) పోలవరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

55
వంశధార, నాగావళి నదుల వద్ద అప్రమత్తత అవసరం
Image Credit : Getty

వంశధార, నాగావళి నదుల వద్ద అప్రమత్తత అవసరం

భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. నదుల్లో ఈతకు వెళ్లడం, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లడం వంటి ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, గురువారం సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పలాసలో అత్యధికంగా 40.7 మిల్లీమీటర్లు, కంచిలిలో 27 మి.మీ., మందసలో 24.5 మి.మీ., ఇచ్ఛాపురంలో 23.7 మి.మీ., పిన్నింటిపేటలో 17 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(45.5 ov) 329 & 131/4
AUSAUS
429
Day 3 - Session 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని ఆ 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Recommended image2
Arnab Cyclone: కొనసాగుతున్న అర్నబ్ తుపాను బీభత్సం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image3
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అర్న‌బ్ తుపాను వేళ వారికి రూ. 5 ల‌క్ష‌ల సాయం
Related Stories
Recommended image1
Gold Price: తులం బంగారం రూ. 2 ల‌క్ష‌లు కానుందా.? అస‌లు లెక్క‌లు ఇవే
Recommended image2
అమెరికాలో వింత విధానం.. రోడ్డు ప‌క్క‌న టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ‌ర్నిచ‌ర్‌లు.. అన్నీ ఉచితంగానే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved