Pic of The Day: మల్లన్న సాక్షిగా.. ఆ ముగ్గురు
Pic of The Day: కర్నూలు జిల్లా పర్యటనలో భాగంలో ప్రధాని మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ వచ్చిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా మోదీ తొలుత శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి ప్రధాని మోదీ
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ పూజ కార్యక్రమం జరిగింది.
భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు
మోదీ స్వయంగా పంచామృతాలతో రుద్రాభిషేకం చేసి, మల్లికార్జున స్వామిని ఆరాధించారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. మొత్తం 50 నిమిషాలపాటు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
పూజల అనంతరం ప్రధాని మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరంను సందర్శించి ధ్యానం చేశారు. సుమారు మధ్యాహ్నం 12:35 గంటల వరకు ఆయన ధ్యానంలో గడిపారు. మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసరాల్లో కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైలెట్‌గా నిలిచిన ఫొటో..
ప్రధానితో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైలం చేరుకున్నారు. ముగ్గురు కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/YICBX9ILhe
— Narendra Modi (@narendramodi) October 16, 2025
ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన మోదీ
దర్శనానంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించాను. నా తోటి భారతీయుల ఆరోగ్యం, శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం ప్రార్థించాను” అని రాసుకొచ్చారు.
Went to the Sree Shivaji Dhyana Mandir and the Sree Shivaji Darbar Hall in Srisailam. The great Chhatrapati Shivaji Maharaj came to Srisailam in 1677 and also prayed at Srisailam Mallikarjuna Mandir.
The Dhyana Mandir is where he meditated and was blessed by Bhramaramba Devi. pic.twitter.com/psR4P7w2Ko— Narendra Modi (@narendramodi) October 16, 2025