- Home
- Andhra Pradesh
- Pawan Kalyan : వైసిపి శ్రేణులు సైతం షాకయ్యేలా.. పవన్ కల్యాణ్ విడాకులపై జగన్ రియాక్షన్ ఇదే..!
Pawan Kalyan : వైసిపి శ్రేణులు సైతం షాకయ్యేలా.. పవన్ కల్యాణ్ విడాకులపై జగన్ రియాక్షన్ ఇదే..!
పవన్ కల్యాణ్ - అన్నా లెజినోవా దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ సాగుతున్న సమయంలో వైసిపి ఆసక్తికర ప్రకటన చేసింది.

పవన్ విడాకుల వేళ వైసిపి కీలక ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి విదేశీ మహిళ అన్నా లెజినోవాను పవన్ పెళ్ళాడారు... ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట కూడా విడాకులకు సిద్దమయ్యింది. ఈ మేరకు ఇద్దరూ కలిసి తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని... విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు. ఈ నిర్ణయం సినీ, రాజకీయా వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.
అయితే ఈ పవన్ కల్యాణ్ విడాకుల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని చాలామంది అనుకున్నారు. వైసిపి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారని, కార్యకర్తలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తారని భావించారు. వైసిపి అధిష్టానం కూడా వారిని ప్రోత్సహిస్తుందని అనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా వైసిపి నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.
పవన్ కల్యాణ్ విడాకులపై నో కామెంట్స్..
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల ప్రకటన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి అదిష్టానం కీలక సూచనలు చేసింది. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేయవద్దని... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆదేశించింది. నాయకులు ప్రైవసీని గౌరవిస్తూ హుందాగా వ్యవహరించాలని వైసిపి సూచించింది. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు గైడ్ లైన్స్ జారీ చేసింది.
1. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదు.
2. నాయకుల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, వేరేవాళ్లు చేసిన పోస్టులపై రియాక్ట్ అవ్వడం వంటివి చేయరాదు.
3. ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకులు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పోస్టులను షేర్ చేయవద్దు. ప్రచారం చేయడానికి ప్రయత్నించరాదు.
4. రాజకీయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించాలి... బాధ్యతాయుతంగా ఉండాలి.
ఈ నాలుగు సూచనలను వైసిపి నాయకులు, కార్యకర్తలు పాటించాలని అదిష్టానం కోరింది.
🚨 OFFICIAL NOTE
Party Leaders, Cadre & Social Media Activists are requested to refrain from commenting on or sharing content concerning the personal matters of political leaders.
All concerned are urged to respect privacy and exercise discretion in public communications.
- YSRCP Central Office
#YSRCP #JaganannaConnects
— Jagananna Connects (@JaganannaCNCTS) November 10, 2026
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహమా?
సందు దొరికితే చాలు పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగే వైసిపి ఇంత సాప్ట్ గా వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే దీనివెనక రాజకీయ వ్యూహం దాగుందనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ విడాకులు, మూడు పెళ్లిళ్ల గురించి వైసిపి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసింది. ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కూడా వైసిపి ఓటమికి, జనసేన గెలుపుకు కారణమనే వాదన ఉంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా పవన్ కల్యాణ్ విడాకుల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు, పోస్టులు వద్దని వైసిపి అదిష్టానం భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి... పంచాయితీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై స్పందిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిరిగా చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనేది వైసిపి భావిస్తున్నట్లుంది. ఎందుకొచ్చిన తలనొప్పి... ఈ విషయంపై స్పందించకపోవడమే మంచిదని అనుకుంటున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. అందుకే నో రియాక్షన్ అంటున్నారు.













