- Home
- Andhra Pradesh
- Monsoon: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మారనున్న వాతావరణం.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
Monsoon: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మారనున్న వాతావరణం.. ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల భగభగలకు బ్రేక్ పడనుంది. నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. అలాగే, పసిఫిక్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిచింది.

రుతుపవనాల ఎంట్రీకి కౌంట్‌డౌన్!
ఈ మే నెలలో ఎండలు, ఉక్కపోతతో జనాలు ఊపిరాడకుండా ఇబ్బంది పడ్డారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ హాట్ అప్‌డేట్స్‌కు ఎండ్ కార్డ్ పడే టైం వచ్చేసింది. వాతావరణంలో పెను మార్పులు స్టార్ట్ అయ్యాయి.
ఇటీవల కాస్త స్లో అయిన నైరుతి రుతుపవనాలకు (Monsoon) సడన్‌గా బూస్టింగ్ దొరికింది. లక్షద్వీప్ కింద యాక్టివేట్ అయిన ఒక పవర్‌ఫుల్ విండ్ సిస్టమ్, ఈ రుతుపవనాలను వేగంగా ఇండియా వైపు నెడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మే 31 లేదా జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ చెప్పింది. జూన్ 5 నుంచి 10 మధ్యలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో జంగ్మీ తుపాను ప్రళయం
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జంగ్మీ (Typhoon Jangmi) అనే భీకర ట్రాపికల్ స్టోర్మ్ అంతకంతకూ బలపడుతోంది. ఇది ప్రజెంట్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, జపాన్ వైపు దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. దీని వేగం గంటకు 175 కిలోమీటర్లకు చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ టైపూన్ ఎఫెక్ట్ వల్ల ఎల్‌నినో కండిషన్స్ పెరిగే అవకాశం ఉంది.
ఈ ఎల్‌నినో వల్లే యాక్చువల్‌గా మే 26నే రావాల్సిన రుతుపవనాలు కాస్త ఆలస్యమై జూన్ స్టార్టింగ్‌కు షిఫ్ట్ అయ్యాయి. సరిగ్గా గతేడాది లాంటి సీన్ ఇక్కడ రిపీట్ అవుతుండటం గమనార్హం. అయినప్పటికీ, అంటార్కిటికా నుంచి వస్తున్న చల్లని గాలులు, యాక్టివ్ అయిన భూమధ్య రేఖ మనకు ప్లస్ పాయింట్‌గా మారాయి.
ఏపీలో విచిత్రమైన క్లైమేట్.. ఓవైపు సెగలు, మరోవైపు వానలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పగటిపూట భానుడు భగభగలాడుతుంటే, సాయంత్రానికి సీన్ రివర్స్ అవుతోంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఏపీపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్ వల్ల మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో 43 నుంచి 45 డిగ్రీల ఎండ ఉన్నా, ఆ తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా, ఏజెన్సీ ఏరియాల్లో హోరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం పరిసర ప్రాంతాలను అర్థరాత్రి దాటాక కూడా వర్షాలు ముంచెత్తే ఛాన్స్ ఉంది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్.. ఆ జిల్లాలకు హై అలర్ట్
తెలంగాణలోనూ ఎండల తీవ్రతతో పాటు వానల జోరు కనిపించనుంది. మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు టచ్ అవుతాయి. కానీ సాయంత్రం 2 గంటల తర్వాత వాతావరణం కూల్ అయిపోతుంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది.
వరంగల్, కేసముద్రం పరిసరాల్లో రాత్రి 10 గంటల తర్వాత వర్షం పడొచ్చు. అయితే వానలు పడేటప్పుడు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు, కొన్నిసార్లు ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో రాకాసి ఈదురుగాలులు వీస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి పిడుగుల సమస్య చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
రైతులకు ఐఎండీ కీలక సూచనలు.. ఖరీఫ్ ప్లానింగ్ చేసుకోండి
ప్రపంచంలో సగం దేశాలకు వర్షాలు పడక కరవుతో ఉంటే, మన దేశంలో మాత్రం ఈసారి సీజన్ ప్రారంభంలోనే మంచి వర్షాలు కురవబోతున్నాయి. జూన్ 5 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే రైతులు ఏమాత్రం లేట్ చేయకుండా ఖరీఫ్ (Kharif Season) పనులకు రెడీ అవ్వాలని అగ్రికల్చర్ సైంటిస్ట్‌లు చెప్తున్నారు.
ఎందుకంటే జులై నాటికి మళ్లీ ఎల్‌నినో యాక్టివ్ అయితే పంటలు ఎండిపోయే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే త్వరగా నారుమళ్లు వేసుకుంటే, జులై ఎండలను తట్టుకునే స్థాయికి మొక్కలు ఎదుగుతాయి.

