ఆలయాలపై దాడులకు నిరసనగా... దీపం వెలిగిస్తున్న పవన్ కల్యాణ్ (ఫోటోలు)

First Published Sep 11, 2020, 6:32 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు ఈ రోజు సాయంత్రం 5.30ని.లకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సామరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆకాంక్షించారు.