10 అర్హతతో ఇస్రో లో రూ. 63 వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు
ISRO SDSC Recruitment 2025: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో 158 సైంటిస్టులు, ఇంజనీర్లు, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారీ వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు అందిస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఉద్యోగావకాశాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC–SHAR)-శ్రీహరికోట భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 158 టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. దీని కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే యువతకు ఇది ఒక అద్భుత అవకాశం.
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 16 నుండి ప్రారంభమై నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించి సమయానికి దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు, పోస్టుల వివరాలు ఇవే
ఇస్రో షార్ ఈసారి వివిధ విభాగాల్లో మొత్తం 158 పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో ముఖ్యమైన పోస్టులు ఇవి:
- సైంటిస్టు / ఇంజనీర్ ‘SC’ – 23 పోస్టులు
- టెక్నికల్ అసిస్టెంట్ – 25 పోస్టులు
- సైంటిఫిక్ అసిస్టెంట్ – 3 పోస్టులు
- లైబ్రరీ అసిస్టెంట్ ‘A’ – 1 పోస్టు
- టెక్నీషియన్ ‘B’ – 64 పోస్టులు
- ఫైర్‌మ్యాన్ ‘A’ – 6 పోస్టులు
- డ్రైవర్, కుక్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఈ నియామకాలు ప్రధానంగా శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) లో ఉంటాయి. అయితే కొన్ని పోస్టులు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఉంటాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇస్రో ఉద్యోగాలు: అర్హతలు ఏమిటి?
పోస్టుల వారీగా అర్హతలు ఇలా ఉన్నాయి:
• సైంటిస్టు/ఇంజనీర్ SC: సంబంధిత విభాగంలో B.E/B.Tech లేదా M.E/M.Tech/M.Sc (ఇంజనీరింగ్)
• టెక్నికల్ అసిస్టెంట్: ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్.
• టెక్నీషియన్ / డ్రాఫ్ట్‌స్మాన్: SSC/SSLC తో పాటు ITI లేదా సమానమైన ట్రేడ్ సర్టిఫికేట్.
• కుక్ / డ్రైవర్ / ఫైర్‌మ్యాన్: SSLC పాస్, సంబంధిత అనుభవం కలిగి ఉండాలి.
వయసు పరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
సాలరీ ఎంత? ఇతర ప్రయోజనాలు ఏముంటాయి?
ఇస్రోలో పని చేయడం గొప్ప గౌరవం మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా లాభదాయకం. వేతనాలు లెవల్ 2 నుండి లెవల్ 10 (₹56,100 – ₹1,77,500) వరకు ఉంటాయి. ఉదాహరణకు, సైంటిస్టు/ఇంజనీర్ ‘SC’ పోస్టుకు నెలకు రూ.56,100 ప్రాథమిక వేతనం, మొత్తం రూ.86,000 వరకు జీతం ఉంటుంది. అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA), మెడికల్ సదుపాయాలు, హౌసింగ్, ఎల్టీసీ, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి అనేక లాభాలు కూడా అందిస్తారు.
పరీక్ష ప్రక్రియ, ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఎంపిక విధానం పోస్టులను బట్టి మారుతుంది.
• సైంటిస్టు/ఇంజనీర్ పోస్టులకు: రాత పరీక్ష + ఇంటర్వ్యూ ఉంటుంది.
• టెక్నికల్ పోస్టులకు: రాత పరీక్ష + స్కిల్ టెస్ట్ ఉంటుంది.
• డ్రైవర్ / ఫైర్‌మ్యాన్ పోస్టులకు: రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.
రాత పరీక్షలో సాధారణంగా 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నెగటివ్ మార్కులు ఉంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఏమిటి?
దరఖాస్తు సమర్పించే ముందు పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్లను స్కాన్ చేసుకోవాలి.
1. ISRO SDSC SHAR అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
2. ADVERTISEMENT No. SDSC SHAR/RMT/01/2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
3. అర్హతలను పరిశీలించి “Apply Online” పై క్లిక్ చేయాలి.
4. వ్యక్తిగత వివరాలు నింపి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
5. ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
6. సబ్మిట్ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 16, 2025
• దరఖాస్తు ముగింపు: నవంబర్ 14, 2025
ఫీజు కేటగిరీ ప్రకారం వేరుగా ఉంటుంది. మహిళలు, SC/ST/PwBD అభ్యర్థులకు రాయితీ ఇచ్చారు.