MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి అటాక్ .. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఈ ప్రాంతాలు అతలాకుతలమే..

Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి అటాక్ .. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఈ ప్రాంతాలు అతలాకుతలమే..

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నిరోజులు ఎండావాన పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. అయితే ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయంటోంది.   

2 Min read
Author : Arun Kumar P
Published : May 01 2026, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్..
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్..

Rain Alert : మే అంటేనే మండుటెండలు... సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల ఇదే. కానీ ఈసారి ఈ నెలలోకి ఇలా ఎంటర్ అయ్యామో లేదో అలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భానుడి భగభగలు కొనసాగుతున్నాయి... ఇదే సమయంలో వర్షాలు కూడా జోరందుకుంటాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మే మొదటివారం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏపీలో వర్షాలే వర్షాలు...
Image Credit : Getty

ఏపీలో వర్షాలే వర్షాలు...

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వర్షాలకు అనుకూలమైన వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందట... ఇక ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు మరో ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అల్లకల్లోలం సృష్టించవచ్చు... కాబట్టి తీరప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని IMD సూచిస్తోంది. నాలుగైదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వేసవి వర్షాలు చాలా ప్రమాదకరమైనవి... పిడుగులు, ఈదురుగాలులు ప్రమాదాలను సృష్టించే అవకాశాలుంటాయి... కాబట్టి రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) సూచిస్తోంది. ముఖ్యంగా వర్ష సమయంలో చెట్ల కింద ఉండరాదని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెబుతోంది.

34
ఏపీలో మండుటెండలు..
Image Credit : Gemini

ఏపీలో మండుటెండలు..

ఓవైపు వర్షాలు కురుస్తాయంటూ చల్లని కబురు చెబుతూనే మరోవైపు ఎండలు మరింత ముదురుతాయంటూ షాక్ ఇస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... తాజాగా నెల్లూరు జిల్లా గూడూరులో ఏకంగా 45.8°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటోంది... ముఖ్యంగా దక్షిణ కోస్తాలో మూడు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.

ఎండలు ముదరడంతో వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. పల్నాడు జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి... అలాగే అమరావతిలో 41.7, నెల్లూరు, నందిగామలో 41.6, కావలిలో 41.4, విజయవాడలో 40.6 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

44
తెలంగాణలో వర్షాలు..
Image Credit : X

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణపై కూడా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఉంటుందని... ఇక్కడ కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ (మే 1, శుక్రవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. మే 7 వరకు అంటే వారంరోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని... వర్షాలు కొనసాగుతాయని వాతవరణ శాఖ ప్రకటించింది.

7- day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated : 01.05.2026@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @CommissionrGHMC @Comm_HYDRAA @Indiametdept pic.twitter.com/PwuSI8QGUd

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 1, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
Now Playing
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
Recommended image3
Now Playing
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
Related Stories
Recommended image1
Now Playing
Rain Alert : అల్పపీడనం రెడీ...ఈప్రాంతాల్లో వర్షబీభత్సమే, అల్లకల్లోలం తప్పదా..? | Asianet News Telugu
Recommended image2
Rain Alert: ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌డ‌గండ్ల వాన‌లు.. ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోలం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved