MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • భార్య బరువెక్కుతోందని ఈ భర్త ఏం చేశాడో తెలుసా..? యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలా..!

భార్య బరువెక్కుతోందని ఈ భర్త ఏం చేశాడో తెలుసా..? యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలా..!

కట్టుకున్న భార్య బరువెక్కడంతో భారంగా భావించాడు ఓ కిరాతకుడు. యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరి ఆమెతో అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఏపీలో వెలుగుచూసిన ఈ ఘటనలో అసలు ఏం జరిగిందంటే..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 06 2026, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్యాభర్తల బంధానికే మచ్చలాంటి దారుణం...
Image Credit : X/Telugu Scribe

భార్యాభర్తల బంధానికే మచ్చలాంటి దారుణం...

ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది... మరీముఖ్యంగా భార్యాభర్తల బంధం పూర్తిగా బలహీనం అయిపోయింది. జీవితాంతం కలిసి జీవించాల్సినవాళ్లు చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు... వైవాహిక జీవితాన్ని విచ్చిన్నం చేసుకుంటున్నారు. ఇంకొందరు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు... జీవిత భాగస్వామిని కిరాతకంగా చంపుతున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఇలాంటి వార్తలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. కానీ ఓ దుర్మార్గుడు భార్య లావుగా ఉందని అంతమొందించాడు... ఈ ఘటన మన తెలుగు రాష్ట్రంలోనే వెలుగుచూసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలేం జరిగింది...?
Image Credit : X

అసలేం జరిగింది...?

ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ ముద్దునూరుకు చెందిన పద్మజను పెళ్లిచేసుకున్నాడు. పెళ్ళి సమయంలో కూడా పద్మజ కాస్త లావుగా ఉండేది... కానీ ఆమె ఆస్తిపై కన్నేసిన కిరణ్ ఇల్లరికం వెళ్ళాడు. ఇలా ఈ దంపతులు ముద్దునూరు కొత్తకొట్టాలలో నివాసం ఉండేవారు... వీరికి ఓ అమ్మాయి సంతానం.

అయితే సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న కిరణ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటివద్దే పని చేసేవాడు. కొంతకాలం వీరి సంసారం సాఫీగానే సాగింది... కానీ ఇటీవల కాలంలో కిరణ్ భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమె లావుగా ఉండటంతో అందంగా లేదని భావించాడు.. సన్నగా మారాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయినా భార్య బరువు తగ్గకపోవడంతో ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Related Articles

Related image1
Crime: ఛీఛీ వీళ్లు అసలు మనుష జన్మే ఎత్తారా..కట్నంగా కిడ్నీ ఇవ్వలేదని..కోడలిని చితకబాదిన అత్తమామలు!
Related image2
Crime: ల‌వ‌ర్‌కి రక్తంతో లెటర్ రాసినా నేరమే అని తెలుసా.? జైలుకు వెళ్లాల్సిందే..
34
భార్యను ఎలా చంపాలి..? యూట్యూబ్ లో సెర్చ్
Image Credit : Getty

భార్యను ఎలా చంపాలి..? యూట్యూబ్ లో సెర్చ్

భార్యను ఈజీగా ఎలా చంపాలో కిరణ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడికి ఓ ఫోన్ నెంబర్ లభించిందని... వారికి కాల్ చేస్తే కొరియర్ లో విషం తెప్పించుకున్నాడని తెలిపారు. పద్మజ కుటుంబసభ్యులతో ఇబ్బందులు రాకుండా తన స్వస్థలం ప్రొద్దుటూరులో ఈ మర్డర్ ప్లాన్ చేశాడు.

తల్లిదండ్రులను చూసొద్దామని చెప్పి భార్య పద్మజను ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాడు కిరణ్. అక్కడ ఆమెకు అనుమానం రాకుండా ప్రేమ కురిపించాడు... ఈ క్రమంలోనే పాలకోవా తీసుకువచ్చి అందులో విషం కలిపాడు... దీన్ని భార్య పద్మతో తినిపించాడు. భర్త ప్రేమగా ఇవ్వడంతో ఆ అమాయకురాలు పాలకోవా తినేసింది... తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

అయితే విషం తిన్నా పద్మజ ప్రాణాలు కోల్పోలేదు... దీంతో భర్త కిరణ్ ఆమెను మరింత దారుణానికి పాల్పడ్డాడు. భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు... దీంతో విలవిల్లాడిపోయిన ఆమె చివరకు ప్రాణాలు కోల్పోయింది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు గుండెపోటుతో భార్య చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.

44
పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం...
Image Credit : Getty

పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం...

కిరణ్ మాటలను పద్మజ పుట్టింటివారు కూడా నమ్మారు... ఆమె నిజంగానే గుండెపోటుతో చనిపోయిందని భావించారు. కానీ పోలీసుల ఎంట్రీతో అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది... అనుమానాస్పద మరణంగా భావించి పోస్టమార్టం చేయించారు. దీంతో అసలు నిజం బైటపడింది... ఆమె శరీరంలో విషం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో కిరణ్ ను విచారించగా అసలు నిజం చెప్పాడు... భార్యను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Crime: ఛీఛీ వీళ్లు అసలు మనుష జన్మే ఎత్తారా..కట్నంగా కిడ్నీ ఇవ్వలేదని..కోడలిని చితకబాదిన అత్తమామలు!
Recommended image2
Crime: ల‌వ‌ర్‌కి రక్తంతో లెటర్ రాసినా నేరమే అని తెలుసా.? జైలుకు వెళ్లాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved