MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Andhra Pradesh
  • పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?

పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?

Garikapati: ప్రముఖ ప్రవచన కర్త గరకపాటి నరసింహారావు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అయితే తాజాగా ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో వ్యాఖ్య‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 21 2026, 10:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మధ్యాహ్న భోజన పథకం వ్యాఖ్యలతో మొదలైన చర్చ
Image Credit : Asianet News

మధ్యాహ్న భోజన పథకం వ్యాఖ్యలతో మొదలైన చర్చ

ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. పేద విద్యార్థులపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పలువురు విమర్శలు చేస్తుండగా, మరోవైపు ఆయన బృందం మాత్రం ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు గరికపాటి ఏమన్నారు?
Image Credit : facebook.com/srigarikipatinarasimharaoofficial/

అసలు గరికపాటి ఏమన్నారు?

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గరికపాటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. పిల్లలకు భోజనం, గుడ్లు, పుస్తకాలు, యూనిఫారాలు అన్నీ ఉచితంగా ఇస్తే చదువుపై దృష్టి తగ్గుతుందని ఆయన చెప్పినట్లు ఆ వీడియోలో వినిపిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు చదువుకోడానికి కాకుండా భోజనం కోసం మాత్రమే వస్తున్నారని వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. పిల్లలకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే వారు చదువుపై శ్రద్ధ పెట్టరని, అలా చేస్తే వారు శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.

Related Articles

Related image1
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.
Related image2
హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
35
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు
Image Credit : facebook.com/srigarikipatinarasimharaoofficial/

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు

వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది గరికపాటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని అవమానించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు కూడా స్పందించి ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పేద పిల్లల విద్యకు సహాయపడే పథకాలపై ఇలా మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం పెద్ద చర్చగా మారింది.

45
వివాదంపై గరికపాటి బృందం స్పందన
Image Credit : Garikapati officail

వివాదంపై గరికపాటి బృందం స్పందన

వివాదం తీవ్రంగా మారడంతో గరికపాటి నరసింహారావు బృందం కూడా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తి ప్రసంగం కాదు, కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమే అని వారు తెలిపారు. ఆయన అసలు ఉద్దేశ్యం మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా పేద విద్యార్థులను అవమానించడం కాదని చెప్పారు. ఉపాధ్యాయులు చదువు చెప్పడం కంటే బోధనేతర పనుల్లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారని వివరించారు. వీడియోను కట్ చేసి వేరే సందర్భంతో కలిపి ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.

55
రాజమండ్రి సభ వీడియోపై వివరణ
Image Credit : our own

రాజమండ్రి సభ వీడియోపై వివరణ

గరికపాటి బృందం ప్రకారం, రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్న వీడియోను కూడా వ‌క్రీక‌రించార‌ని తెలిపారు. ఆ సభలో ఆయన అలా మాట్లాడలేదని, వేరే సందర్భంలో చెప్పిన మాటలను కలిపి వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గరికపాటి ఎప్పుడూ పేదల పక్షాన మాట్లాడే వ్యక్తి అని, గతంలో కూడా ఆయన అనేకసార్లు అదే విషయాన్ని పలు ప్లాట్ ఫామ్ పై టీమ్ పేర్కొంది. కొందరు కావాలనే తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు.

వివాదం ముగిసినట్లేనా.? 

ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించే వారు ఉండగా, మరోవైపు ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. ఈ వివరణతో వివాదం ముగుస్తుందా లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
Recommended image2
AP Road Accident : చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Now Playing
జగన్ ను ఇమిటేట్ చేసిన లోకేష్ | Nara Lokesh Imitates YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.
Recommended image2
హైద‌రాబాద్‌లో బ‌త‌కాలంటే నెల‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved