MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపాను బాధితులకు రూ.5000 ఆర్థికసాయం... అర్హులెవరో తెలుసా?

మొంథా తుపాను బాధితులకు రూ.5000 ఆర్థికసాయం... అర్హులెవరో తెలుసా?

Aid for Fishermen Families : మొంథా తుపాను కారణంగా ఉపాదిలేక ఇబ్బందిపడుతున్న మత్స్యకారులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం. వారికి ఆర్థికసాయం చేసే ఆలోచనలో చంద్రబాబు సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 29 2025, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొంథా తుపాను బాధితులకు అండగా కూటమి సర్కార్..
Image Credit : X/Telugu Desam Party

మొంథా తుపాను బాధితులకు అండగా కూటమి సర్కార్..

Cyclone Montha : గత నాలుగైదు రోజులుగా బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. శనివారం (అక్టోబర్ 25న) అల్పపీడనం ఏర్పడి ఆదివారం(అక్టోబర్ 26న) వాయుగుండంగా… సోమవారం(అక్టోబర్ 27న) తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 28న) తీవ్ర తుపానుగా మారింది... గత రాత్రి ఈ మొంథా తుపాను తీరం దాటింది. ఇలా సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటంతో మత్స్యకారులను చేపలవేటకు వెళ్లరాదని ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ నాలుగైదురోజులు ఉపాధి ఆగిపోవడంతో మత్స్యకారులకు ఆదాయం లేకుండాపోయింది… ఆ పేదకుటుంబాల పోషణ భారంగా మారింది.

వేట నిషేధమే కాదు మొంథా తుపాను తీరందాటే సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు, కురుస్తున్న భారీ వర్షాలు తీరప్రాంతాల్లోని మత్సకార గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇలా తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నిరుపేద మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రతి కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం, ఇతర ఆహార సామాగ్రి అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతేకాదు మత్స్యాకారులకు ఆర్థిక సాయం కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మత్స్యకారులకు ఆర్థికసాయం?
Image Credit : stockphoto

మత్స్యకారులకు ఆర్థికసాయం?

మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో గత కొద్దిరోజులుగా ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న మత్స్యకారులకు ఐదువేల చొప్పున ఆర్థికసాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపారట. అయితే ఈ ఆర్థికసాయంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు... కాబట్టి మత్స్యకారులకు సాయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

35
బాధిత ప్రజలకు ఆర్థిక సాయం
Image Credit : X/Telugu Desam Party

బాధిత ప్రజలకు ఆర్థిక సాయం

మొంథా తుపాను కారణంగా ఇళ్లూవాకిలి వదిలి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, మంచినీటితో ఇతర సౌకర్యాలు కూడా కల్పించింది. ఇంతేకాకుండా తుపాను కారణంగా కలిగిన నష్టానికి పరిహారంగా పునరావాస కేంద్రంలోని ప్రతి కుటుంబానికి రూ.3000 ఆర్థిక సాయం చేస్తోంది... అలాగే ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఈమేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రాల్లో మమ్మల్ని ప్రభుత్వం బాగా చూసుకుంటోంది. 
మా ఇళ్ళ దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టింది ప్రభుత్వం.. #APpreparesForMontha#CycloneMontha#AndhraPradesh pic.twitter.com/e1BEiHHHy9

— Telugu Desam Party (@JaiTDP) October 28, 2025

45
రైతులకు సాయం
Image Credit : our own

రైతులకు సాయం

మొంథా తుపాను కారణంగా ఎక్కువగా నష్టపోయేది రైతులే... అందుకే బాధిత అన్నదాతలను కూడా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వర్షాలు, వరదలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే మద్దతుధరతో కొనేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదట పత్తి కొనుగోలును ప్రారంభించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని... సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు వ్యవసాయ అధికారులు. అయితే మొంథా తుపాను కారణంగా పత్తి తడిసి పాడయిపోయే పరిస్థితి నెలకొంది... దీంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారు. ఇలా జరక్కుండా ఉండేందుకు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది చంద్రబాబు సర్కారు... రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.8110 చెల్లించి పత్తిని సేకరిస్తోంది ప్రభుత్వం.

పత్తి రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని దానికి తగినట్లు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం సూచిస్తోంది.

2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. పత్తి రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో… pic.twitter.com/84fOqERrMR

— Telugu Desam Party (@JaiTDP) October 28, 2025

55
మొంథా తుపాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం
Image Credit : X/AndhraPradeshCM

మొంథా తుపాను సమర్ధవంతంగా ఎదుర్కొన్న కూటమి ప్రభుత్వం

భయంకరమైన మొంథా తుపానును కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, అధికారులు గత రెండుమూడు రోజులుగా తుపాను సమయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపైనే పనిచేశారు. ప్రజలకు ముందుగానే వాతావరణ పరిస్థితులపై సమాచారం అందించడం... ప్రమాదం పొంచివున్న ప్రాంతాలకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ను మొహరించడం, అత్యవసర సేవల విభాగాలను అప్రమత్తం చేయడం చేశారు. దీంతో గతరాత్రి మొంథా తుపాను తీరందాటినా పెద్దగా నష్టమేమీ జరగలేదు.

తుపాను ప్రమాదం పొంచివున్న దాదాపు 1328 గ్రామాల్లో ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించింది ప్రభుత్వం. అన్ని సౌకర్యాలతో 1906 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే ప్రసవాలకు దగ్గరగా ఉన్న 3,465 మంది గర్భిణీలను హాస్పిటళ్ళకు తరలించింది. మత్స్యకారులను వేటకు వెళ్ళకుండా నిషేధం విధించింది. 11 NDRF, 12 SRDF టీమ్ లు సిద్ధంగా ఉంచింది. తుపాను గాలికి చెట్లు విరిగిపడితే వెంటనే వాటిని తొలగించేలా 145 వుడ్ కటింగ్ టీమ్స్ రెడీగా ఉంచింది. ఇలాంటి ముందుస్తు చర్యలతో మొంథా తుపాను ప్రమాదాన్ని తగ్గించింది ప్రభుత్వం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
విజయవాడ
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
ప్రభుత్వ పథకాలు
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Recommended image3
Now Playing
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు | YS Sharmila Meets YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
విజయనగరంలో మొంథా తుపాను విధ్వంసం .. 30 మంది విద్యార్థులకు కరెంట్ షాక్
Recommended image2
సముద్రంలోంచి భూమిపైకి చేరిన మొంథా .. ఇక ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే, తస్మాత్ జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved