జగన్ మీద ఫైట్: ఇక చంద్రబాబు ఒంటరి, బెడిసికొట్టిన వ్యూహాలు

First Published 1, Aug 2020, 9:39 AM

మూడు రాజధానుల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటరి అయినట్లు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన ఒంటరిగానే పోరాటం చేయాల్సి రావచ్చు. బిజెపి జగన్ మీద పోరాటం చేస్తామని చెప్పినప్పటికీ ప్రధానంగా చంద్రబాబునే టార్గెట్ చేసే అవకాశాలున్నాయి.

వైఎస్ జగన్ కు తాము మాత్రమే ప్రత్యామ్నాయమని చూపించుకోవడానికి బిజెపి ప్రధానంగా చంద్రబాబును వెనక్కి నెట్టే వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది. పక్కా ప్రణాళికతో సోము వీర్రాజును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి తమ వ్యూహాలకు పదను పెట్టినట్లు కనిపిస్తోంది.

బిజెపితో దగ్గరవుదామని భావించిన చంద్రబాబు వ్యూహాలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. బిజెపిలో చేరిన పాత టీడీపీ నేతల పప్పులు కూడా ఉడికే పరిస్థితి లేదు. జగన్ మీద కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన బిజెపి ఎంపీ సుజనా చౌదరికి బిజెపి నాయకత్వం కళ్లెం వేసినట్లే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుపై గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై ఆయన మాట్లాడకపోవడం కూడా దాన్నే సూచిస్తోంది.

పాత మిత్రుడైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును వదిలేసే పరిస్థితులే ఉన్నాయి. ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన బిజెపి పంథాలోనే నడవాల్సి రావచ్చు. జగన్ కు చురకలు అంటించినప్పటికీ ఆయన చంద్రబాబును బలపరితే పరిస్థితి లేదు. అమరావతి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

మూడు రాజధానులకు అనుమతిస్తూ గవర్నర్ బిల్లులను ఆమోదించడంపై చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. కానీ ఆయనకు ఇతర పార్టీల నుంచి ఏ విధమైన మద్దతు లభించలేదు. వైసీపీ, బిజెపి పెట్టే చిక్కుల్లో ఆయన తల్లడిల్లిపోయే పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి.

loader