MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబు అరెస్టు: బాలక్రిష్ణ చేతుల్లోకి టిడిపి, జూ.ఎన్టీఆర్ దూరమే

చంద్రబాబు అరెస్టు: బాలక్రిష్ణ చేతుల్లోకి టిడిపి, జూ.ఎన్టీఆర్ దూరమే

 పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతున్నప్పటికీ ఎక్కువగా కోర్టు వ్యవహారాలనే ప్రధానంగా చూసుకునే అవకాశం ఉంది. నారా లోకేష్ తన పాదయాత్రను ఆపేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారం సమీపంలోనే ఆయన ఉంటున్నట్లు సమాచారం.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Sep 12 2023, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన నేపథ్యంలో పార్టీని నడిపించేందుకు నందమూరి హీరో బాలక్రిష్ణ రంగంలోకి దిగారు. పార్టీ వ్యవహారాలను అన్నింటినీ ఆయనే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించి, కార్యాచరణను రూపొందించి అమలు చేసే బాధ్యతలను ఆయన తీసుకున్నట్లు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలక్రిష్ణ తన సినిమా షూటింగ్ లు రద్దు చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో బాలక్రిష్ణ టిడిపి వ్యవహారాలను చూడడానికి ముందుకు రావడంతో ఆ సినిమా షూటింగ్ సకాలంలో పూర్తవుతుందా, లేదా అనేది చూడాల్సిందే. బాబీ దర్శకత్వంలో బాలక్రిష్ణ మరో సినిమాను ప్రకటించారు. అదింకా సెట్స్ లోకి వెళ్లలేదు

36

చంద్రబాబు కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్కువగా కోర్టు వ్యవహారాలను చూసే బాధ్యతను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతున్నప్పటికీ ఎక్కువగా కోర్టు వ్యవహారాలనే ప్రధానంగా చూసుకునే అవకాశం ఉంది. నారా లోకేష్ తన పాదయాత్రను ఆపేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారం సమీపంలోనే ఆయన ఉంటున్నట్లు సమాచారం.

46

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో జైలుకు వెళ్లినప్పుడు పార్టీ కార్యక్రమాలను ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ నిర్వహించారు. షర్మిల పాదయాత్ర కూడా చేశారు. అలాగే ప్రస్తుతం చంద్రబాబు సతీమణి, ఆయన కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వారు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో పార్టీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్నప్పటికీ వారిద్దరు రాజకీయాల్లోకి రారనే మాట వినిపిస్తోంది

56

చంద్రబాబు అరెస్టుపై నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. కానీ ఆయన దూరంగానే ఉండదలుచుకున్నట్లు అర్థమవుతోంది. సినిమాలు చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి తనకు సినిమాలు తప్ప మరేదీ పట్టనట్లుగా ఉన్నారు.

66

మొత్తం మీద, చంద్రబాబు అరెస్టుతో టిడిపి సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నట్లే చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్టు పరిణామాలు, పార్టీపై దాని ప్రభావం ఎలా ఉంటాయనే విషయం మీదనే టిడిపి నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో టిడిపి క్యాడర్ తీవ్రమైన నిరాశకు, నిస్సహాయతకు గురైనట్లు భావిస్తున్నారు. టిడిపి శ్రేణులకు నైతిక బలాన్ని చేకూర్చే బాధ్యతను బాలక్రిష్ణ స్వీకరించినట్లు తెలుస్తోంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert: వచ్చే 3 రోజులు ఆ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు.. భారీ వర్షాలు !
Recommended image2
Now Playing
పవన్ తెలంగాణ రాజకీయాలపై మాధవ్ కీలక కామెంట్స్ | BJP MP Madhav Press Meet | Asianet News Telugu
Recommended image3
Now Playing
అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | AP State Food Commission Chairman | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved