అమరావతిపై బిజెపి నేతలు తలో మాట: చంద్రబాబు టార్గెట్, జగన్ కు చిక్కులు

First Published 17, Aug 2020, 12:51 PM

బీజేపీ నాయకులు ఒక్కొక్కరు మూడు రాజధానుల తరలింపు అంశంపై ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. రామ్ మాధవ్, జివిఎల్ వంటి వారేమో కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదు కానీ తాము రైతులకు న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ, ఇన్ని కావు. మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకిస్తుండగా, అధికార వైసీపీ ఏమో... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే, పాలనా వికేంద్రీకరణ జరగాల్సిందేనని పట్టుపట్టి కూర్చుంది. ఈ రెండు పార్టీల వైఖరి మనకు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పటికీ.... జనసేన బీజేపీల వైఖరేమిటో మాత్రం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.

కోర్టులో కేంద్రం తమకు ఈ మూడు రాజధానుల విషయంలో సంబంధం లేదు అనే అఫిడవిట్ దాఖలు చేయడం, దానికి ముందు జరిగిన పరిణామాలను గమనిస్తే వైసీపీ ఈ విషయంలో కేంద్రానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్టుగానే కనబడుతుంది.

ఈ వాదనలను పక్కనుంచితే... బీజేపీ నాయకులు ఒక్కొక్కరు మూడు రాజధానుల తరలింపు అంశంపై ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. రామ్ మాధవ్, జివిఎల్ వంటి వారేమో కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదు కానీ తాము రైతులకు న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని అంటున్నారు. రామ్ మాధవ్ మొన్న సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవంలో రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే... రాజధాని విషయంలో కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదు అనకుండా, కేంద్రం పాత్ర పరిమితం అని అన్నాడు.

ఈ యన ఒక్కరి వ్యాఖ్యలను మాత్రమే పరిశీలిస్తే బీజేపీ వ్యూహం అర్థం అవదు. మరికొంతమందివి కూడా పరిశీలించి ఆ తరువాత ఒక అవగాహనకు రావలిసి ఉంటుంది. సుజనా చౌదరి ఎప్పటినుండో కూడా సరైన సమయంలో కేంద్రం సరైన రీతిలో జోక్యం చేసుకుంటుంది అని అంటున్నారు.

ఈ రెండు వ్యాఖ్యలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ... ఈ రెండు వ్యాఖ్యలు కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి మనకు బీజేపీ వైఖరిని అవగతం చేసేవిగా కనబడుతున్నాయి. ఇక తాజాగా ఒక సీనియర్ బీజేపీ నాయకుడు మాటల సందర్భంగా కేంద్రం ఆస్తులు కూడా అమరావతిలో ఉన్నాయి అని అన్నారు.

నిన్న సోము వీర్రాజు గిరిజన యూనివర్సిటీని తరలిస్తాము అంటే వద్దు అని పోరుబాట పట్టారు. అది భోగాపురం ప్రాంతంలోదే అయినప్పటికీ... బీజేపీ మాత్రం తరలింపులను ఒప్పుకోదు అనేది ఇక్కడ అర్థమవుతుంది.

ఈ అన్ని పరిస్థితులను బేరీజు వేసుకొని చూసుకుంటే... మనకు అప్పుడు బీజేపీ వైఖరి అర్థమవుతుంది. బీజేపీ అమరావతిలో రైతులకు న్యాయం చేస్తామనే చెబుతుంది. అందునా వారికి రాజకీయంగా రాష్ట్రంలో జెండా పాతాలంటే... టీడీపీని ఖాళీ చేపించడంతోపాటుగా టీడీపీ ఓటర్లను కూడా తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు.

అమరావతి ఉద్యమంలో టీడీపీ ఓటర్లను తిప్పుకోవాలనుకుంటున్న బీజేపీ అక్కడ ఏదో ఒకవిధంగా బీజేపీ వల్ల కలిగిన లాభం ఇది అని చూపెట్టుకోవాలిసిన ఆవశ్యకత ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకుల మాటలను పోల్చి చూసుకుంటే మనకు దీని వెనక ఉన్న విషయం అర్థమవుతుంది.

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలానే భూములు కొన్నాయి. ఆర్బీఐ, ఎస్బిఐ వంటి సంస్థలు అనేకం అక్కడ భూములను కొన్నాయి. అక్కడ భూములను కొనడానికి ప్రధాన కారణం రాజధాని వస్తుందని. అంతే తప్ప విజయవాడ పక్కనున్న తాడేపల్లి పైనో, ఉద్దండరాయుని పాలెం పై ప్రేమే మమకారాలతో మాత్రం కాదు కదా!

ఇప్పుడు ఆ సంస్థలను గనుక అమరావతి నుండి విశాఖకు తరలించకుండా అక్కడే ఉంచగలిగితే... బీజేపీ నిబద్దత ఇది. కేంద్రం తన సంస్థలను ఇక్కడే ఉంచడం వల్ల ప్రజలకు అనాయాయం జరగకుండా చూసింది అని చెప్పుకునే వీలుంటుంది. ఇది బీజేపీ ఆలోచన.

ఈ కేంద్ర సంస్థలు అక్కడే గనుక నిర్మాణమయితే... ఎంతో కొంత అభివృద్ధి తథ్యం. ఈ అభివృద్ధిని ప్రజలకు చూపెట్టుకోవాలనుకుంటుం<wbr />ది బీజేపీ. తమ చేతుల్లో ఉన్నంతమేర శక్తివంచనలేకుండా ప్రజల కోసము తాము కృషి చేశామని చెప్పుకోవాలనుకుంటుంది.

ఈ కేంద్ర సంస్థలు అక్కడే గనుక నిర్మాణమయితే... ఎంతో కొంత అభివృద్ధి తథ్యం. ఈ అభివృద్ధిని ప్రజలకు చూపెట్టుకోవాలనుకుంటుంది బీజేపీ. తమ చేతుల్లో ఉన్నంతమేర శక్తివంచనలేకుండా ప్రజల కోసము తాము కృషి చేశామని చెప్పుకోవాలనుకుంటుంది.

ఇలా చేయడం వల్ల అమరావతిలో లాభం పొందడంతోపాటుగా, విశాఖలో కూడా తమ రాజకీయ ఆకాంక్షలకు గండి పడకుండా చూసుకోగలుగుతుంది బీజేపీ. ఇది బీజేపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వింత వ్యాఖ్యలు చేయడం వెనకున్న అసలు ఆంతర్యం.

loader