MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వెంట్రుకల నుండి ఎండుచేపల వరకు : బస్సులో అస్సలు తీసుకెళ్లకూడనివి ఏంటో తెలుసా?

వెంట్రుకల నుండి ఎండుచేపల వరకు : బస్సులో అస్సలు తీసుకెళ్లకూడనివి ఏంటో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి బస్సులో కొన్ని పదార్థాలను తీసుకెళ్లడం నిషేధం. అయితే ఇందులో సాధారణ వస్తువులైన మనిషి వెంట్రుకలు, ఎండుచేపలు వంటివి కూడా వున్నాయి. కాబట్టి బస్సులో తీసుకెళ్లకూడని వస్తువులేమిటో తెలుసుకుందాం. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 23 2024, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
APSRTC Prohibited Items

APSRTC Prohibited Items

 
APSRTC : సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టిసి బస్సులను ఉపయోగిస్తుంటారు. పేద,మధ్యతరగతి ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టిసి కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ ఖర్చులోనే ఎక్కువ దూరం సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే ముందుగా గుర్తుకువచ్చేది ఈ బస్సులే. ఆ ఆర్టిసి బస్సులతో ప్రజలకు ప్రత్యేక అనుబంధం వుంది... వీటిని తమ సొంతంగా భావిస్తుంటారు. 

అయితే కొందరు ఖర్చు తగ్గుతుందని భావించి బస్సుల్లో వివిధ రకాల వస్తువులు కూడా తరలిస్తుంటారు. సాధారణ వస్తువులు తరలిస్తే పర్వాలేదు... కానీ కొన్నింటిపై ఆర్టిసి బస్సుల్లో నిషేధం వుంటుంది. అలాంటి వస్తువులను తరలిస్తూ పట్టుబడితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి కూడా కొన్నింటిని బస్సుల్లో తరలించడంపై నిషేధం విధించింది. ఆ వస్తువుల్లో మనిషి తల వెంట్రుకలు, ఎండు చేపలు వంటివి అనేకం వున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
APSRTC Prohibited Items

APSRTC Prohibited Items

ఏపిఎస్ ఆర్టిసి బస్సుల్లో తరలించకూడని వస్తువులివే :  

1. పేలుడు పదార్థాలు : కొందరు ప్రయాణికులు వ్యక్తిగత అవసరాల కోసమో లేదంటే వ్యాపార పనులకోసమో ఆర్టిసి బస్సుల్లో పెట్రోల్, డీజిల్ వంటివారిని తరలిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం... ప్రయాణికుల రక్షణ కోసం ఇలాంటి పేలుడు స్వభావమున్న వస్తువులను బస్సుల్లో తరలించడంపై నిషేదం విధించిన ఏపిఎస్ ఆర్టిసి. 

కిరోసిన్, గ్యాసోలైన్, మిథైలేటెడ్ స్పిరిట్, టర్ఫెంటైన్, యాసిడ్స్, సల్ఫర్, కాల్ తార్, గన్ పౌడర్ వంటి పదార్థాలు కూడా బస్సులో తరలించడం నిషేధం. వీటిని తరలిస్తూ పట్టుబడితే ఫైన్ విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.

దీపావళి, న్యూ ఇయర్ వంటి పండగల వేళ టపాసులు పేలుస్తుంటారు. కొందరు వీటిని కొనుగోలుచేసి బస్సులో తీసుకెళుతుంటారు. అయితే ఇవి కూడా పేలుడు పదార్థాలే కాబట్టి ఏపీఎస్ ఆర్టిసి బస్సుల్లో వీటిపై నిషేధం వుంది...కాబట్టి ఇలా తరలిస్తూ పట్టుబడితే చిక్కుల్లో పడతారు. 

బుల్లెట్స్ లోడ్ చేసిన తుపాకితో బస్సులో ప్రయాణించడం కూడా నేరమే. గ్యాస్ సిలిండర్ కూడా పేలుడు స్వభావాన్ని కలిగివుంటుంది. కాబట్టి దీనిపై కూడా బస్సుల్లో నిషేధం వుంది. 
 

34
APSRTC Prohibited Items

APSRTC Prohibited Items

2. అటవీ ఉత్పత్తులు : 

అటవీ ప్రాంతాల్లోని ప్రజలు కొన్నిరకాల అటవీ ఉత్పత్తులను తెలియక ఆర్టిసి బస్సుల్లో తరలిస్తుంటారు. ఇక మరికొందరు రహస్యంగా విలువైన అటవీ, జంతువులకు శరీరభాగాలు, వాటికి సంబంధించిన వస్తువులు తరలిస్తుంటారు. ఇలా తెలియన అయినా, తెలిసయినా కొన్ని  వస్తువులను ఏపీఎస్ ఆర్టిసి బస్సుల్లో తరలించడం నేరం. 

జంతువుల తోలు, కొమ్ములు, ఎముకలు, పక్షుల ఈకలు, చేపలు (ఎండుచేపలు కూడా), చనిపోయిన  జంతువులు ఆర్టిసి బస్సులో తరలించకూడదు. పెంపుడు జంతువులను కూడా బస్సుల్లో తీసుకెళ్లకూడదు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలను కూడా బస్సులో తరలించకూడదు. 

3.  సినిమా ఫిల్మ్ : 

ఒకప్పుడు సినిమా ఫిల్మ్స్ ను దూర ప్రాంతాలకు ఈజీగా చేరవేసేందుకు బస్సులను ఉపయోగించేవారు. అయితే వీటిని భద్రంగా ప్యాక్ చేసి పంపేవారు. ఇదే అదునుగా కొందరు సినిమా రీళ్లను అక్రమంగా తరలించడం చేసేవారు. దీంతో ప్యాక్ చేయకుండా తరలించే సినిమా రీల్స్ పై కూడా ఏపిఎస్ ఆర్టిసి నిషేధం విధించింది. 

44
APSRTC Prohibited Items

APSRTC Prohibited Items

4.మనిషి వెంట్రుకలు : 

ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి మనిషి వెంట్రుకలను కూడా ఆర్టిసి బస్సుల్లో తరలించడంపై నిషేధం విదించింది. వెంట్రుకలకు మంచి గిరాకీ వుండటంతో వాటిని అక్రమంగా ఆర్టిసి బస్సుల్లో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే వీటిపై నిషేధం విధించారు. 

మానవ మృతదేహాలను కూడా ఆర్టిసి బస్సులో తరలించకూడదు. మృతదేహాలను కేవలం సొంత వాహనాలు లేదంటే ప్రైవేట్ వాహనాలు, అంబులెన్స్ లో మాత్రమే తరలించుకోవాలి. 

5. నిషేధిత కరపత్రాలు, పుస్తకాలు :

హింసను ప్రేరేపించేలా వుండేవి, యువతను తప్పుడుమార్గంలో తీసుకెళ్లే రచనలపై నిషేధం వుంది. ఇలాంటివి బస్సుల్లో తరలించకూడదు. ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించి కరపత్రాలతో పట్టుబడితే కఠిన శిక్షలు వుంటాయి. 
 
6.ఇతర పదార్థాలు :  

ప్యాక్ చేయని పత్తి బేళ్లు, ఉలన్, పొగాకు వస్తువులను కూడా ఏపీఎస్ ఆర్టిసి బస్సుల్లో తరలించడం నిషేధం. బైక్స్, స్కూటర్లను కూడా బస్సులో తరలించే ప్రయత్నం చేయకూడదు. అలాగే కొన్నిరకాల ప్రమాదకర పురుగులను కూడా తరలించడం నిషేధం. 

ఇక మత్తు పదార్థాలపై కూడా ఏపీఎస్ ఆర్టిసి నిషేధం విధించింది. వీటిని తరలించేవారికి కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల స్మగ్లింగ్ పై చాలా సీరియస్ గా వుంది... తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఎన్టీఆర్ జిల్లాలో గెలుపెవరిది? ఉత్కంఠగా కౌంటింగ్ | NTR District Collector Lakshmi Sha on Counting
Recommended image2
School Holidays : మురసు తుపాను తీరందాటినా ముంతపోత వర్షాలు కంటిన్యూ.. ఈ జిల్లాల్లో స్కూల్ సెలవుల సంగతేంటి?
Recommended image3
AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ హడావుడి.. తుపాను వానల్లో ఓట్ల లెక్కింపు రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved