MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • APSPDCL రిక్రూట్‌మెంట్ 2026: నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

APSPDCL రిక్రూట్‌మెంట్ 2026: నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

APSPDCL AEE Recruitment : ఏపీ విద్యుత్ శాఖలో 135 AEE పోస్టుల భర్తీకి ఏపీఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 01 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Image Credit : Gemini

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి కెరీర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APSPDCL) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్‌పై ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగంలో సెటిల్ అవ్వాలని చూస్తున్న బీటెక్ గ్రాడ్యుయేట్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
APSPDCL AEE Recruitment 2026 : ఖాళీల వివరాలు ఇవే
Image Credit : Gemini AI

APSPDCL AEE Recruitment 2026 : ఖాళీల వివరాలు ఇవే

ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. వేర్వేరు డిపార్ట్‌మెంట్స్ వారీగా చూసుకుంటే.. అత్యధికంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో 125 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) విభాగంలో 6 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలికాం) విభాగంలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. మీ క్వాలిఫికేషన్‌ను బట్టి ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.

Related Articles

Related image1
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Related image2
8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50% పెరిగే ఛాన్స్ !
36
విద్యార్హతలు, వయోపరిమితి ఎంత ఉండాలి?
Image Credit : Gemini AI

విద్యార్హతలు, వయోపరిమితి ఎంత ఉండాలి?

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్టులలో బీఈ లేదా బీటెక్ పాస్ అయి ఉండాలి. అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే.. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్న వారికి ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది.

46
జీతం మామూలుగా లేదు.. పూర్తి వివరాలు
Image Credit : Gemini AI

జీతం మామూలుగా లేదు.. పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్‌లో అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తున్న మెయిన్ హైలైట్ శాలరీనే. ఇందులో ఉద్యోగం సాధిస్తే లైఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మొదట రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ రెండేళ్ల ప్రొబేషన్ టైమ్‌లో నెలకు రూ.75,000 చొప్పున కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. ప్రొబేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుంది. అప్పుడు బేసిక్ పే స్కేల్ రూ.86,245 నుంచి ప్రారంభమై ఏకంగా రూ.2,08,915 వరకు ఉంటుంది. అంటే నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం అందుకునే సూపర్ ఛాన్స్ ఇది.

56
ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫీజు వివరాలు ఇవే
Image Credit : Gemini

ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫీజు వివరాలు ఇవే

ఈ ఏఈఈ (AEE) పోస్టులకు అభ్యర్థుల సెలక్షన్ ప్రాసెస్ చాలా పారదర్శకంగా జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రాత పరీక్ష ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఫైనల్‌గా సెలెక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాయడానికి, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద అభ్యర్థులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల ద్వారా ఈ ఫీజును సింపుల్‌గా పే చేయవచ్చు.

66
అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు ఇవే
Image Credit : Getty

అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు ఇవే

అర్హత, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే తమ అప్లికేషన్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30 నుంచి అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చివరి తేదీ జులై 20. కాబట్టి లాస్ట్ మినిట్ రష్, సర్వర్ ప్రాబ్లమ్స్ లాంటి తలనొప్పులు లేకుండా ఉండాలంటే, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కూటమిపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jaganmohan Reddy Pressmeet | CM Chandrababu | Asianet News telugu
Recommended image2
YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తి కొన‌సాగ‌దా.? తేల్చి చెప్పేసిన జ‌గ‌న్
Recommended image3
Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50% పెరిగే ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved