MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • APPSC Jobs : రూ.25,000 నుండి రూ.1,54,000 జీతాలు.. ఈ అక్టోబర్ లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలివే

APPSC Jobs : రూ.25,000 నుండి రూ.1,54,000 జీతాలు.. ఈ అక్టోబర్ లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలివే

APPSC Jobs : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. నెలనెలా వేల నుండి లక్షల్లో సాలరీ కలిగి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

3 Min read
Arun Kumar P
Published : Sep 27 2025, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల జాతర
Image Credit : gemini

ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల జాతర

 APPSC Jobs : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా అసెంబ్లీ వేదికన ఆసక్తికర ప్రసంగం చేశారు. కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) అధికారంలోకి వచ్చాక భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు... కేవలం 15 నెలల్లోనే అన్ని రంగాలు, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం వెల్లడించారు. ఇందులో ఇటీవల నియామక పత్రాలు అందించిన ప్రభుత్వ ఉపాద్యాయ ఉద్యోగాలతో పాటు భారీ పెట్టుబడుల ద్వారా ప్రైవేట్ రంగాల్లో జరిగిన ఉద్యోగ నియామకాలు ఉన్నాయి.

మెగా డీఎస్సీ ద్వారా 15941 ఉద్యోగాలను భర్తీ చేశాం... అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో మరో 9093 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశామని స్వయంగా సీఎం వెల్లడించారు. ఇక పోలీస్ శాఖలో 6100 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ - జాబ్ మేళాల ద్వారా 92,149, వర్క్ ఫ్రం హోం ద్వారా 5500... ఇలా ప్రైవేట్ రంగంలో మొత్తంగా 3,48,891 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఎవరు ఎక్కడ, ఎప్పుడు ఉద్యోగం పొందారు.. ఏ జాబ్ చేస్తున్నారు అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా కూడా వెల్లడిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

27
ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్
Image Credit : X/Telugu Desam Party

ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్

ఇలా లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాదు ఇకపై భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించడమే కాదు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC)తో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా రెగ్యులర్ గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపిపిఎస్సి కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది... నెలనెలా లక్షల సాలరీతో కూడిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ నుండి ప్రారంభంకానుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే వెంటనే ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి. ఆసక్తి, అర్హత కలిగివుంటే దరఖాస్తు చేసుకోడానికి సిద్దంకండి.

Related Articles

Related image1
Railway Jobs : నెలనెలా లక్షల్లో జీతం, అలవెన్సులు... రైల్వేలో 8875 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Related image2
Airport Jobs : కేవలం టెన్త్ చదివితే చాలు.. నెలకు ఐదంకెల జీతంలో ఎయిర్ పోర్టులో జాబ్స్
37
అక్టోబర్ లో దరఖాస్తులు ప్రారంభమయ్యే టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు :
Image Credit : getty

అక్టోబర్ లో దరఖాస్తులు ప్రారంభమయ్యే టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు :

1. వెల్ఫేర్ ఆర్గనైజర్ ఉద్యోగాలు (ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో)

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు -10

సాలరీ : రూ.25,220 నుండి రూ.80,910 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2025

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 29-10-2025

విద్యార్హతలు : ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు (ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటే మాజీ సైనిక ఉద్యోగులు అర్హులు)

వయోపరిమితి : గరిష్టంగా 45 ఏళ్లలోపు వయసుండాలి.

47
2. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్
Image Credit : Getty

2. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు : 07

సాలరీ : రూ.48,440 నుండి రూ.1,37,220 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2025

దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 29-10-2025

అర్హతలు : ఇండియన్ ఆర్మీలో పనిచేసినవారు అర్హులు. ఆర్మీతో పాటు నేవి, ఎయిర్ పోర్స్ లో పనిచేసినవారు అర్హులు

వయోపరిమితి : గరిష్టంగా 52 ఏళ్లలోపువారు అర్హులు

57
3. ఏపీ మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు
Image Credit : Getty

3. ఏపీ మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు

జూనియర్ అకౌంటెంట్ (కేటగిరి 2 & 4), సీనియర్ అకౌంటెంట్ (కేటగిరి 3) - మొత్తం ఖాళీలు 11

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2025

దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 29-09-2025

సాలరీ, వయో పరిమితి :

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (కేటగిరి 2) - రూ.44,570 నుండి రూ.1,27,480 వరకు సాలరీ ఉంటుంది - 18 నుండి 42 ఏళ్లలోపు వయసువారు అర్హులు

సినీయర్ అకౌంటెంట్ - రూ.34,580 నుండి రూ.1,07,210 వరకు సాలరీ ఉంటుంది - 18 నుండి 42 ఏళ్లలోపు వయసువారు అర్హులు

జూనియర్ అకౌంటెంట్ (కేటగిరి 4) - రూ.25,220 నుండి రూ.80,910 వరకు సాలరీ ఉంటుంది - 18 నుండి 42 ఏళ్లలోపు వయసువారు అర్హులు

విద్యార్హతలు ; అన్ని ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి

67
4. ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
Image Credit : Gemini

4. ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు : 01

సాలరీ : రూ.65,360 నుండి రూ.1,54,980 వరకు ఉంటుంది.

వయో పరిమితి : 18 నుండి 42 ఏళ్లలోపు వారు అర్హులు

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-10-2025

దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 28-10-2025

విద్యార్హతలు : మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తిచేసి వుండాలి. 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

77
5. రాయల్టీ ఇన్స్ ఫెక్టర్ (ఏపీ మైన్స్ ఆండ్ జియాలజీ సర్వీస్)
Image Credit : Getty

5. రాయల్టీ ఇన్స్ ఫెక్టర్ (ఏపీ మైన్స్ ఆండ్ జియాలజీ సర్వీస్)

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు : 01

సాలరీ : రూ.45,830 నుండి రూ.1,30,580 వరకు ఉంటుంది.

వయోపరిమితి : 18 నుండి 42 ఏళ్లలోను వయసుండాలి

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-10-2025

దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ : 28-10-2025

విద్యార్హతలు : జియాలజీ లో బిఎస్సి డిగ్రీ పూర్తిచేసి వుండాలి రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విద్య
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved