MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • APPSC : నెలనెలా రూ.1,47,760 సాలరీతో గవర్నమెంట్ జాబ్స్.. ఈ అక్టోబర్ లోనే ఆఖరి ఛాన్స్, వెంటనే అప్లై చేసుకొండి

APPSC : నెలనెలా రూ.1,47,760 సాలరీతో గవర్నమెంట్ జాబ్స్.. ఈ అక్టోబర్ లోనే ఆఖరి ఛాన్స్, వెంటనే అప్లై చేసుకొండి

APPSC : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటి దరఖాస్తుకు ఈ నెల (అక్టోబర్ 2025) చివరితేదీ. కాబట్టి వెంటనే అప్లై చేసుకోవాల్సిన ఈ ఉద్యోగాలేేవో ఇక్కడ తెలుసుకొండి.

2 Min read
Arun Kumar P
Published : Oct 03 2025, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఏపీలో ఉద్యోగాల జాతర
Image Credit : iSTOCK

ఏపీలో ఉద్యోగాల జాతర

APPSC Jobs : తెలుగు విద్యార్థులకు బంపరాఫర్... డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది... తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) ద్వారా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

27
ఏపిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్
Image Credit : Screenshot to TDP Whatsapp Channel

ఏపిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్

కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఇక పోలీస్ శాఖలో కూడా 6100 ఉద్యోగులను కొత్తగా నియమించింది. ఇలా తమ గవర్నమెంట్ ఏర్పడ్డాక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మొత్తం 4 లక్షలకు పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికన ప్రకటించారు. ఇకపై కూడా ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే ఏపిపిఎస్సి ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.

ఇటీవల హార్టీకల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), డ్రాట్ మ్యాన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం. అన్ని అర్హతలుండి ఈ ఉద్యోగాలపై ఆసక్తి గలవారు వెంటనే అప్లై చేసుకొండి... ఎందుకంటే ఈ అక్టోబర్ లోనే దరఖాస్తు గడువు ముగుస్తుంది.

Related Articles

Related image1
APPSC Jobs : నెలనెలా రూ.25,220 నుండి రూ.1,37,220 సాలరీ .. అక్టోబర్ లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాలివే
Related image2
APPSC Jobs : రూ.25,000 నుండి రూ.1,54,000 జీతాలు.. ఈ అక్టోబర్ లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలివే
37
అక్టోబర్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు
Image Credit : getty

అక్టోబర్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

1. హార్టీకల్చర్ ఆఫీసర్

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 02

సాలరీ : రూ.54,060 నుండి రూ.1,40,540 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18-09-2025

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 08-10-2025 (రాత్రి 11PM వరకు)

విద్యార్హతలు :

తప్పనిసరిగా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్ లో ఫోర్ ఇయర్స్ బిఎస్సి డిగ్రీ లేదా బిఎస్సి (ఆనర్స్) పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)

47
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), రూరల్ వాటర్ సప్లై ఆండ్ సానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్
Image Credit : Getty

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), రూరల్ వాటర్ సప్లై ఆండ్ సానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 03

సాలరీ : రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18-09-2025

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 08-10-2025 (రాత్రి 11PM వరకు)

విద్యార్హతలు :

తప్పనిసరిగా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)

57
3. డ్రాట్స్ మ్యాన్ గ్రేడ్ 2 (టెక్నికల్ అసిస్టెంట్), ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ ఉద్యోగాలు
Image Credit : X/DFOpkd

3. డ్రాట్స్ మ్యాన్ గ్రేడ్ 2 (టెక్నికల్ అసిస్టెంట్), ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ ఉద్యోగాలు

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 13

సాలరీ : రూ.34,580 నుండి రూ.1,07,210 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18-09-2025

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 08-10-2025 (రాత్రి 11PM వరకు)

విద్యార్హతలు :

తప్పనిసరిగా ఐటిఐలో డ్రాట్ మ్యాన్ (సివిల్) ట్రేడ్ సర్టిఫికేట్ కలిగివుండాలి లేదా అందుకు సమానమైన అర్హతలు కలిగివుండాలి.

వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)

67
4. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఉమెన్), A.P.B.C Welfare Subordinate Service
Image Credit : Getty

4. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఉమెన్), A.P.B.C Welfare Subordinate Service

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 01

సాలరీ : రూ.37,640 నుండి రూ.1,15,500 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17-09-2025

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 07-10-2025 (రాత్రి 11PM వరకు)

విద్యార్హతలు :

తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి బిఈడి లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి.

వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)

77
5. జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ (ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్)
Image Credit : gemini

5. జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ (ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్)

భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 02

సాలరీ : రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17-09-2025

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 07-10-2025 (రాత్రి 11PM వరకు)

విద్యార్హతలు :

తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సైన్స్ లేదా కామర్స్ (B.A/B.Sc/B.Com). లైబ్రరీ సైన్స్ లో పిజి చేసివుండాలి.

వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విద్య

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved