- Home
- Andhra Pradesh
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో జాబితా రెడీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసేయండి!
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో జాబితా రెడీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసేయండి!
తల్లికి వందనం రెండో విడత జూలై 5న డబ్బులు జమ కానున్నాయి. జాబితాలో మీ పేరు ఉందో లేదో వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల కోసం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం మొదటి విడత ద్వారా ఇప్పటికే వేలాది మందికి నేరుగా ఆర్థిక సహాయం అందించింది. జూన్ 12వ తేదీ నుంచి మొదలైన డబ్బుల జమ ప్రక్రియలో, అర్హత కలిగిన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున డబ్బులు జమ చేశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి తల్లికి ఒకటి కాదు, రెండోసారి కూడా ఈ మొత్తం లభించే అవకాశం ఉండటంతో ఆసక్తి పెరిగింది.
రెండో విడత డేటా
అయితే తొలి విడతలో కొన్ని తల్లులకు డబ్బులు జమ కాలేదు. ముఖ్యంగా ఇటీవలే పిల్లలు స్కూల్లో చేరిన వారు, ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల తల్లులు ఈ జాబితాలో లేకపోవచ్చు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రెండో విడత డేటాను తయారు చేసింది. ఈ నెల 5న వీరి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది.
రెండు మార్గాలు
రెండో విడతకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. తల్లుల పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ద్వారా చెక్ చేయాలంటే అధికారిక వెబ్‌సైట్ అయిన https://gsws-nbm.ap.gov.in లోకి వెళ్లి అక్కడ “తల్లికి వందనం” అనే పథకాన్ని ఎంచుకుని, తల్లి ఆధార్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు డేటాబేస్ ఆధారంగా మీ అర్హత వివరాలు చూపిస్తాయి.
ఈ నెల 5లోగా
రెండో మార్గం వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం. ప్రభుత్వ మన మిత్ర సేవ ద్వారా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు +91 95523 00009 అనే వాట్సాప్ నంబర్‌కి “Thalliki Vandanam” అని పంపితే, మీకు సమాచారం వస్తుంది. ఇది పథకానికి అనుసంధానంగా రూపొందించిన డిజిటల్ సేవలలో భాగం.ఇదిలా ఉండగా, స్కూళ్లలో ప్రవేశాలు తీసుకున్న పిల్లలకు మొదటి తరగతి నుంచే తల్లికి వందనం ప్రయోజనం వర్తించనుంది. వీరి తల్లులకు కూడా ఈ నెల 5లోగా పథక బెనిఫిట్లు అకౌంట్లలో జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.
ఉపాధ్యాయ అవార్డులు
ఇంకా, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో కీలక కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతోంది. జూలై 10న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల స్థాయిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించనున్నారు. దీని ద్వారా విద్యా విధానాల్లో మార్పులకు తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటున్నారు.ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో ఇచ్చే ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ నెల 13వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పడే ఎంపిక కమిటీ ఆగస్టు 4లోపు జాబితాను కేంద్రానికి పంపుతుంది. ఆ తరువాత ఆగస్టు 5 నుంచి 12 వరకు వీడియో ఇంటర్వ్యూలు నిర్వహించి, 13న తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అవార్డులు అందజేయనున్నారు.
అవార్డులు ఇవ్వాలని
ఈ అవార్డులపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంతో కాలంగా నిబద్ధతతో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇది న్యాయం చేయడమని వారు అభిప్రాయపడుతున్నారు.