- Home
- Andhra Pradesh
- Thalliki Vandanam: అర్హత ఉన్నా తల్లికి వందనం నగదు రాలేదా..అయితే ఈ ఒక్క పని చేయండి చాలు!
Thalliki Vandanam: అర్హత ఉన్నా తల్లికి వందనం నగదు రాలేదా..అయితే ఈ ఒక్క పని చేయండి చాలు!
తల్లికి వందనం పథకం కింద డబ్బులు అందని అర్హులకు జూలై 5న నిధులు జమ కానున్నాయని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. జూన్ 30న తుది అర్హుల జాబితా విడుదల చేయనున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

‘తల్లికి వందనం’ పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద జూన్ 12న ప్రారంభమైన నిధుల జమ ప్రక్రియపై ఇంకా చర్చ కొనసాగుతోంది. లక్షలాది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ, కొంతమంది అర్హుల ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు పడలేదని వారు ఆరోపిస్తున్నారు. సాంకేతిక లోపాలు, బ్యాంక్ లింకింగ్ సమస్యలు ఇందుకు కారణమయ్యే అవకాశం ఉంది.
జూన్ 30న తుది జాబితా
జూన్ 20 వరకు అర్జీలు, జూన్ 30న తుది జాబితా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జూన్ 20 వరకు అర్జీలు స్వీకరించింది. ప్రస్తుతం ఈ అర్జీల పరిశీలన జరుగుతుంది. జూన్ 28లోపు పరిశీలన పూర్తి చేసి, జూన్ 30న తుది అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు.
డబ్బులు రాలేకపోయిన కారణాలు
అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా NPCIకి లింక్ అయ్యిందా, ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందా, ఖాతా యాక్టివ్‌గా ఉందా అనే అంశాలు ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా NPCI లింకింగ్ లోపమే ఎక్కువ కేసుల్లో ప్రధాన సమస్యగా గుర్తించారు.
NPCI లింకింగ్ కోసం సూచనలు
ప్రభుత్వం తల్లులు లేదా వారి తరఫున అకౌంట్ ఓపెన్ చేసి, NPCIకి అనుసంధానించాలని సూచిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో విద్యాశాఖ అధికారులు సహాయం అందిస్తున్నారు. ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ తీసుకెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలి. అవసరమైతే సామాజిక సంక్షేమ శాఖ సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
జులై 5న డబ్బులు
జమ ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులకు జూన్ 12న డబ్బులు జమ కాలేదు. ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల ఈ మార్పు వచ్చింది. వీరికి జూలై 5న నిధులు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఆర్థిక మార్పులు & నిబంధనలు 2025–26 విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. గతంలో రూ.15వేలు ఇవ్వగా, ఈసారి రూ.13వేలు తల్లుల ఖాతాల్లోకి జమ అవుతాయి. మిగిలిన రూ.2వేలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల నిర్వహణకు వినియోగిస్తారు.
అర్హత ప్రమాణాలు:
గ్రామీణ ఆదాయం: రూ.10వేలు లోపు
పట్టణ ఆదాయం: రూ.12వేలు లోపు
కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి
మాగాణి భూమి ≤ 3 ఎకరాలు / మెట్టు భూమి ≤ 10 ఎకరాలు
నాలుగు చక్రాల వ్యక్తిగత వాహనం ఉన్నవారు అనర్హులు (వ్యాపార వాహనాలకు మినహాయింపు)
విద్యుత్ వినియోగం ≤ నెలకు 300 యూనిట్లు
మున్సిపాలిటీలో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇల్లు ఉన్నవారు అనర్హులు
ప్రభుత్వ ఉద్యోగులు/పెన్షనర్లు అనర్హులు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు)
ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా అర్హులే కారు