MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు

AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విధానంలో కీలక మార్పు రానుంది. న‌వంబ‌ర్ 1 నుంచి పెన్ష‌న్ డ‌బ్బులను ల‌బ్ధిదారుల‌కు రెండు విధాలుగా అందించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం.

3 Min read
Author : Narender Vaitla
Published : Oct 06 2026, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నవంబర్ నుంచి పెన్షన్ డబ్బులు రెండు విధాలుగా
Image Credit : Asianet News

నవంబర్ నుంచి పెన్షన్ డబ్బులు రెండు విధాలుగా

నవంబర్ 1 నుంచి పెన్షన్ పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను వేర్వేరుగా లబ్ధిదారులకు అందించే విధానం అమల్లోకి రానుంది. కేంద్రం ఇచ్చే మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం భరించే వాటాను మాత్రం సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు రూపంలో అందిస్తారు. దీంతో పెన్షన్ మొత్తం ఒకేసారి చేతికి రాకుండా.. కొంత నగదు రూపంలో, మిగిలిన మొత్తం బ్యాంకులో జమ అయ్యే విధానం కనిపించనుంది.

ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు సహా పలు కేటగిరీలకు నెలకు రూ.4 వేల పెన్షన్ అందుతోంది. ఇందులో కేంద్రం వాటాగా రూ.200 బ్యాంక్ ఖాతాలో జమ కానుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,800ను ఇంటి వద్ద నగదుగా అందించనుంది. దివ్యాంగులకు అందుతున్న రూ.6 వేలలో కేంద్ర వాటా రూ.300 బ్యాంకులో జమ అవుతుంది. మిగిలిన రూ.5,700ను రాష్ట్ర ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆధార్ లింక్ లేకపోతే డబ్బు జమ కాకపోవచ్చు
Image Credit : Asianet News

ఆధార్ లింక్ లేకపోతే డబ్బు జమ కాకపోవచ్చు

కేంద్ర వాటా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం ఉండటం కీలకం. ఖాతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్ వివరాలు సరిగ్గా అనుసంధానమై ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం ఖాతాలో జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అందువల్ల పెన్షన్ తీసుకునే వారు తమ బ్యాంక్ ఖాతా పనిచేస్తుందా, ఆధార్‌తో అనుసంధానం అయిందా అనే విషయాన్ని ముందుగానే నిర్ధారించుకోవడం మంచిది. కేంద్ర వాటా జమ కాకపోతే సంబంధిత బ్యాంక్ లేదా అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే రాష్ట్ర వాటాగా చెల్లించే నగదు మొత్తాన్ని మాత్రం సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే అందించనున్నారు.

35
కొత్త పెన్షన్లకు దసరా కానుకగా మంజూరు
Image Credit : X

కొత్త పెన్షన్లకు దసరా కానుకగా మంజూరు

కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 13.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిని పరిశీలించి అర్హతలను నిర్ధారించే ప్రక్రియ చేపట్టారు. తొలి విడతలో సుమారు 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ విడతలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో అర్హుల తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం దసరా సందర్భంగా అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెలవులు, దరఖాస్తుల పరిశీలనకు అదనపు సమయం అవసరం కావడంతో అక్టోబర్ 1న కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాలేదు. ఆ రోజు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు మాత్రమే నగదు అందించారు.

45
13 రకాల పెన్షన్లు.. అర్హతలపై కఠిన పరిశీలన
Image Credit : gemini

13 రకాల పెన్షన్లు.. అర్హతలపై కఠిన పరిశీలన

రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు మొత్తం 13 రకాల సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తోంది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు నేతన్నలు, గీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులు, డయాలసిస్ రోగులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా పింఛన్లు ఉన్నాయి. కేటగిరీని బట్టి పెన్షన్ మొత్తం మారుతుంది. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, మిగిలిన పలు కేటగిరీలకు రూ.4 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది.

కొత్త దరఖాస్తుల పరిశీలనలో వయస్సు, కుటుంబ ఆదాయం, భూమి విస్తీర్ణం, విద్యుత్ వినియోగం, ప్రభుత్వ ఉద్యోగం, పట్టణ ప్రాంతాల్లోని ఇంటి విస్తీర్ణం, నాలుగు చక్రాల వాహనం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదనే నిబంధన ఉంది. మెట్ట భూమి 10 ఎకరాలు, మాగాణి భూమి 3 ఎకరాలకు మించకూడదు. అలాగే విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండకూడదు. ఇతర ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న కుటుంబాలకు కూడా అర్హత ఉండదు.

55
అర్హుల జాబితా ఎలా తెలుసుకోవాలి?
Image Credit : Asianet News

అర్హుల జాబితా ఎలా తెలుసుకోవాలి?

కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హత ఉన్నవారి జాబితాతో పాటు అనర్హుల జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. అనర్హత జాబితాలో పేరు వచ్చిన వారికి అందుకు కారణాన్ని తెలియజేయనున్నారు. ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకునే కొన్ని అధికారిక సేవలు అందుబాటులో లేకపోవడంతో.. దరఖాస్తుదారులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెల్ఫేర్ సెక్రటరీ వద్ద తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవచ్చు. కొత్తగా పెన్షన్ మంజూరైన తర్వాత సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరోవైపు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు నవంబర్ నుంచి కేంద్ర వాటా బ్యాంకులో జమ అయ్యే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తమ బ్యాంక్ ఖాతా, ఆధార్ అనుసంధాన వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం అవసరం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Recommended image2
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Related Stories
Recommended image1
తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
Recommended image2
పాములు చ‌ర్మాన్ని ఎందుకు విడుస్తాయి.? ఆ స‌మ‌యంలో మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved