MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Cyclone Arnab : అర్నబ్ తుపానుతో నష్టమే కాదు లాభం కూడా ఉందా..! అదేంటో తెలుసా?

Cyclone Arnab : అర్నబ్ తుపానుతో నష్టమే కాదు లాభం కూడా ఉందా..! అదేంటో తెలుసా?

అర్నబ్ తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టించేలా ఉంది. అయితే దీనివల్ల నష్టాలే కాదు ఓ లాభం కూడా ఉంది… నష్టాన్ని నివారణ చర్యలు చేపడుతూనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంతకీ ఆ లాభం ఏంటో తెలుసా?

4 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 26 2026, 08:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అర్నబ్ తుపాను బీభత్సం తప్పదా..!
Image Credit : Gemini AI

అర్నబ్ తుపాను బీభత్సం తప్పదా..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను తెలుగు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసేలా ఉంది. ఇప్పటికే తుపాను ఏర్పడగా ఇవాళ (అక్టోబర్ 26, సోమవారం) రాత్రి తీవ్ర తుపానుగా బలపడనుందట... ఇది ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తూ బీభత్సం సృష్టించనుంది. తీరందాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు, గంటకు 115 నుండి 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది.

అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది... తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు... ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అర్నబ్ తుపానుతో నష్టమే కాదు లాభం...
Image Credit : Gemini AI

అర్నబ్ తుపానుతో నష్టమే కాదు లాభం...

అర్నబ్ తుపాను ఏపీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు, వరదలు, ఈదురుగాలులతో ఆస్తినష్టం తప్పేలా లేదు... ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్రంలోనే అనేక జలాశయాలు నీరులేక వెలవెలబోతున్నాయి. ఈ సమయంలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... ఈ వరద నీటిని ఒడిసిపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలా సంక్షోభాన్ని కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆర్నబ్ తుపాను కారణంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది... మొత్తం 22 రిజర్వాయర్ల పరిధిలో వరద ప్రవాహాలు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు... దీంతో ఈ ప్రవాహాలతో 10-12 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా తాండవ, రైవాడ, యేలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, తాడిపూడి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీటి నిల్వలు వచ్చే అవకాశం ఉందని... వీలైనంత ఎక్కువ నీటిని రిజర్వాయర్లకు మల్లించాలని సీఎం ఆదేశించారు.

35
అర్నబ్ తుపాను తీరం దాటేది ఎప్పుడో తెలుసా?
Image Credit : X/ Andhra Pradesh CMO

అర్నబ్ తుపాను తీరం దాటేది ఎప్పుడో తెలుసా?

ఆర్నబ్ తుపాను మరింత బలపడి ఆంధ్ర ప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ తుపాను క్రమంగా బలపడుతూ ఏపీ తీరంవైపు దూసుకొస్తుందని... అక్టోబర్ 28న (బుధవారం) బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలోతీరం దాటే అవకాశం ఉందని వాతావరన శాఖ అంచనా వేసిన్నట్లు తెలిపారు. తుపాను ప్రభావంతో అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

అక్టోబర్ 28, 29 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్నారు. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని… అవసరమైన సహాయం పొందాాలని సూచించారు.

45
లోతట్టు ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించాలి : చంద్రబాబు
Image Credit : AI image - Gemini

లోతట్టు ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించాలి : చంద్రబాబు

అర్నబ్ తుపాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలు వరదలు సంభవించనున్నాయి... దీంతో ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను షెల్టర్లలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, చిన్నారులను తరలించడంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,711 మంది గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో వైద్య బృందాలు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

తుపాను సహాయక చర్యల కోసం 7 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను 11 ప్రభావిత జిల్లాల్లో మోహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లో అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచాలని ఆదేశించారు. అవసరమైతే మెరైన్ పోలీసులతో పాటు నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సేవలను కూడా సహాయక చర్యలకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అయితే ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ సురక్షితంగా తీరానికి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 30,043 పడవలు సురక్షితంగా హార్బర్లకు చేరుకున్నాయని సీఎంకు తెలిపారు. తుపాను బలహీనపడి సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

పంటనష్టం జరగకుండా ముందస్తు చర్యలు

అర్నబ్ తుపాను కారణంగా వ్యవసాయం, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కోతకోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు. దాదాపు 1.82 లక్షల హెక్టార్లలో సాగవుతున్న ఉద్యాన పంటలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులకు ముందస్తు సూచనలు అందించాలని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

55
విద్యుత్, నిత్యావసరాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : చంద్రబాబు
Image Credit : X/ Andhra Pradesh CMO

విద్యుత్, నిత్యావసరాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : చంద్రబాబు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాగులు, వంకలు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తుపాను గమనాన్ని నిరంతరం అంచనా వేస్తూ ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ప్రజలకు హెచ్చరికలతో కూడిన బులెటిన్ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత తుపానుల అనుభవాలను విశ్లేషించి రైతులు, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

తుపాను ప్రభావాన్ని బట్టి విద్యాసంస్థలకు సెలవులు

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తుపానుపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో ఆందోళన కలిగించే అసత్య సమాచారంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటగంటకూ సమాచారం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అర్నబ్ తుపానుపై సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు, నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
నారా చంద్రబాబు నాయుడు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays: తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Recommended image2
Now Playing
Kethireddy On AP Local Body Polls 2026 | YS Jagan | Asianet Telugu
Recommended image3
Now Playing
YS Jagan VS CM Chandrababu | AP Localbody Elections 2026 | Asianet Telugu
Related Stories
Recommended image1
Cyclone Arnab Alert: సైక్లోన్ అర్నబ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలకు పెను ముప్పు.. ఆ తేదీల్లో భారీ వర్షాలు
Recommended image2
Cyclone Arnab: తుపానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved